Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ వైఫ్ మైండ్ బ్లోయింగ్‌ టాలెంట్!

టాలీవుడ్ స్టార్ హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందించి వెండి తెర‌పై త‌మ‌దైన మ్యాజిక్‌తో మెస్మ‌రైజ్ చేసే ద‌ర్శ‌కులు చాలా మందే ఉన్నారు.

By:  Tupaki Entertainment Desk   |   5 Jan 2026 5:53 PM IST
స్టార్ డైరెక్ట‌ర్ వైఫ్ మైండ్ బ్లోయింగ్‌ టాలెంట్!
X

టాలీవుడ్ స్టార్ హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని అందించి వెండి తెర‌పై త‌మ‌దైన మ్యాజిక్‌తో మెస్మ‌రైజ్ చేసే ద‌ర్శ‌కులు చాలా మందే ఉన్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. అయితే అలాంటి క్రేజీ స్టార్ డైరెక్ట‌ర్ల ఫ్యామిలీస్ ఏం చేస్తుంటాయి?. వారి టాలెంట్‌ని ఎలా..ఏఏ రంగాల్లో బ‌య‌టపెడుతున్నారు? ఎలాంటి మైండ్ బ్లోయింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌ని ఇస్తున్నార‌న్న‌ది చాలా మందికి తెలియ‌దు. సుకుమార్‌, పూరి జ‌గ‌న్నాథ్ వంటి ద‌ర్శ‌కుల వైఫ్ లు మీడియా ముందుకు రావ‌డం, సినిమా ఫంక్ష‌న్‌ల‌లో క‌నిపించ‌డం తెలిసిందే.

ఇక కేజీఎఫ్, కేజీఎఫ్ 2, స‌లార్ సినిమాల‌తో పాన్ ఇండియా ద‌ర్శ‌కుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న ప్ర‌శాంత్ నీల్ వైఫ్ కూడా సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటూ కీల‌క అప్ డేట్‌ల‌ని అభిమానుల‌తో పంచుకుంటున్నారు. అయితే మాట‌ల మాంత్రికుడిగా, స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న‌ త్రివిక్ర‌మ్ వైఫ్ గురించి మాత్రం చాలా వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. ఆమె పేరు సాయి సౌజ‌న్య‌. గ‌త కొంత కాలంగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న సినిమాల‌కు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారామె.

సార్‌, ల‌క్కీ భాస్క‌ర్ వంటి సినిమాల‌కు స‌హ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స్తుతం సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ప‌లు మూవీస్‌కి ఫార్చూన్ ఫోర్ బ్యాన‌ర్‌పై స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లెజెండ‌రీ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మేన‌కోడ‌లైన సాయి సౌజ‌న్య ఓ క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌. గ‌తంలో ఆమె భ‌ర‌త నాట్యంపై ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌కు స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూనే స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా ఆమె భ‌ర‌త నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తున్నారు.

రీసెంట్‌గా ఆమె భ‌ర‌త నాట్య ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. అందులో ఆమె చూపించిన మైండ్ బ్లోయింగ్ ప్ర‌ద‌ర్శ‌న అంద‌రిని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఆమె ప్ర‌తిభ‌ని చూసి అంతా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అద్భుత‌మైన హావ భావాల‌తో ఆమె ప్ర‌ద‌ర్శించిన నృత్యానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. త్రివిక్ర‌మ్ - సాయి సౌజ‌న్య‌ల‌కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ వ‌య‌సులోనూ సాయి సౌజ‌న్య నాట్యంపై ఉన్న అమిత‌మైన ఇష్టంతో ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తుండ‌టం విశేషం.

సాయి సౌజ‌న్య ప్ర‌స్తుతం సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి మాస్‌కా దాస్ విశ్వ‌క్‌సేన్‌తో `ఫంకీ`, అల్ల‌రి న‌రేష్‌తో `ఆల్క‌హాల్‌`, న‌వీన్ పొలిశెట్టితో `అన‌గ‌న‌గ ఒక రాజు`, అఖిల్ అక్కినేని హీరోగా `లెనిన్‌` వంటి క్రేజీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇందులో న‌వీన్ పొలిశెట్టితో నిర్మించిన `అన‌గ‌న‌గ ఒక రాజు` సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న రిలీజ్ కాబోతోంది. సితార‌తో క‌లిసి సాయి సౌజ‌న్య నిర్మించే సినిమాల‌ను త్రివిక్ర‌మ్ ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఇదిలా ఉంటే వెంకీ మామ‌తో త్రివిక్ర‌మ్ `ఆద‌ర్శ కుటుంబం హౌస్ నం.47`ని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే.