ఆదర్శ కుటుంబంలో హాట్ బ్యూటీ!
ఎంతో మంది నాయికల్ని పరిశీలించి మరీ గురూజీ శ్రీనిధిని ఎంపిక చేసాడు అంటే ఆ పాత్రలో ప్రత్యేకత తప్పనిసరి.
By: Srikanth Kontham | 17 Feb 2026 7:00 AM ISTత్రివిక్రమ్ సినిమా అంటే తారలతో తెరంతా నిండుగా కనిపిస్తుంది. ఏ పాత్రకు ఆ పాత్రను ప్రత్యేకంగా హైలైట్ చేయడం గురూజీ ప్రత్యేకత. పాత్రల ఎంపిక పరంగా బోయపాటికి సారూప్యంగా ఉన్నా? ఆయన్ని మించిన ప్రత్యేకంగా ఆ పాత్రలను తెరపై ఆవిష్కరించడం గురూజీ స్పెషలిస్ట్. అందులోనూ కుటుంబ కథా చిత్రమంటే? మరింత రంగులమయంగా ఉంటుంది. సినిమా టైటిల్ ని బట్టే పక్కా ఫ్యామిలీ స్టోరీ అని తేలిపోయింది. మళ్లీశ్వరికి 2.0లా ఉంటుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఇందులో వెంకటేష్ కు భార్య పాత్రలో శ్రీనిధి శెట్టి కనిపించనుంది.
ఎంతో మంది నాయికల్ని పరిశీలించి మరీ గురూజీ శ్రీనిధిని ఎంపిక చేసాడు అంటే ఆ పాత్రలో ప్రత్యేకత తప్పనిసరి. అలాగే సినిమాలో నారా రోహిత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అవసరం మేర సీనియర్ నటీమణుల్ని కూడా దించడం గురూజీ ప్రత్యేకత. ఇంకా ఆ పాత్రల గురించి విషయాలు బయటకు రాలేదు గానీ ఓ కీలక పాత్రకు మాత్రం హాట్ బ్యూటీ నభా నటేష్ ను ఎంపిక చేసినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. సినిమాకు ఈ పాత్ర ఎంతో కీలకమని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఈ సినిమాతో నైనా నభా నటేష్ రాత మారుతుందేమో చూడాలి.
హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ప్రతిభావంతురాలే. హీరోయిన్ గా అవకాశాలు కూడా బాగానే అందుకుంది. కానీ వైఫల్యాలు సొగసరిని రేసులో వెనక్కి నెట్టాయి. `ఇస్మార్ట్ శంకర్` తర్వాత నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `స్వయంభూ`లో నటిస్తోంది. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆశలన్నీ ఆ సినిమాపైనే పెట్టుకుంది. అయినా గురూజీ నభా నటేష్ లో ప్రతిభను గుర్తించి గొప్ప అవకాశం కల్పించాడు.
ఇలా రెండు సినిమాలు నభా చేతుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకూ నభా నటేష్ సీనియర్ హీరోలతో కలిసి పనిచేసే అవకాశం దక్కలేదు. యంగ్ హీరోలతోనే సినిమాలు చేసింది. మరి వెంకీతో ఛాన్స్ నభా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ లా నిలుస్తుందా? అన్నది చూడాలి. `స్వయంభు` పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ నెలకొంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ అవకాశాలతో అమ్మడు కెరీన్ ని ఎలా పునర్మించుకుంటుందో చూడాలి. నభా నటేష్ కెరీర్ శాండిల్ వుడ్ లో ప్రారంభించినా అక్కడ ఎక్కువ కాలం కొనసాగలేదు. టాలీవుడ్ లోనే కొనసాగుతుంది. ఇక్కడ అవకాశాలు తగ్గినా పర భాషల వైపు చూసింది లేదు.
