Begin typing your search above and press return to search.

'బంధు మిత్రుల'తో వెంకీ రాక.. త్రివిక్రమ్ మార్క్ టైటిల్ అదిరిందిగా!

గతంలో త్రివిక్రమ్ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   30 Nov 2025 12:16 PM IST
బంధు మిత్రులతో వెంకీ రాక.. త్రివిక్రమ్ మార్క్ టైటిల్ అదిరిందిగా!
X

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ వేరు. హిట్లు, ప్లాపులకు అతీతంగా ఆ మ్యాజిక్ ను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సరిగ్గా అలాంటి ఒక క్రేజీ కాంబో ఇప్పుడు సెట్ అయ్యింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో ఒకటే ఉత్సాహం. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద నవ్వుల పువ్వులు పూయడం ఖాయం. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గతంలో త్రివిక్రమ్ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. అ సినిమాలు క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఆ సినిమాల్లోని కామెడీని ఇప్పటికీ యూట్యూబ్ లో చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కోకొల్లలు. రచయితగా త్రివిక్రమ్ అందించిన ఆ మ్యాజిక్, ఇప్పుడు దర్శకుడిగా వెంకీతో రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఒక అచ్చ తెలుగు టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు "బంధు మిత్రుల అభినందనలతో" అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. వినడానికే చాలా ఆహ్లాదకరంగా, పెళ్లి పత్రిక మీద రాతలా ఉన్న ఈ టైటిల్.. సినిమా జానర్ ఏంటో క్లియర్ గా చెప్పేస్తోంది. ఇది పక్కా త్రివిక్రమ్ మార్క్ టైటిల్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. గతంలో 'అ..ఆ', 'అరవింద సమేత' వంటి స్వచ్ఛమైన తెలుగు పేర్లు పెట్టడం గురూజీ స్టైల్.

ఈ టైటిల్ చూస్తుంటే ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. వెంకటేష్ కు ఇలాంటి కుటుంబ కథా చిత్రాలు వెన్నతో పెట్టిన విద్య. "బంధు మిత్రుల అభినందనలతో" అనే పేరులో ఉన్న పాజిటివ్ వైబ్, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడానికి పెద్ద ఎసెట్ అవుతుంది. యాక్షన్ హడావిడి కాకుండా, మనసును హత్తుకునే కథతో వీరు రాబోతున్నారని స్పష్టమవుతోంది.

ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, భారీ తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. త్రివిక్రమ్ పంచ్ డైలాగులు, వెంకటేష్ కామెడీ టైమింగ్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నామనే ఆలోచనే ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది. మొత్తానికి టైటిల్ తోనే సగం విజయం సాధించేశారు. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ టైటిల్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఒకవేళ ఇదే ఖరారైతే, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వెంకీ మామ వింటేజ్ మ్యాజిక్ చూడటం ఖాయం.