Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

దర్శకుడు త్రివిక్రమ్ పాత తరహా బలమైన కథలు, గుర్తుండిపోయే డైలాగులు రాయాలని అభిమానులు కోరుకుంటున్నారు. 'జల్సా', 'ఖలేజా', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సినిమాల్లోని మాటలతో ఆకట్టుకున్న ఆయన, ఇటీవలి చిత్రాల్లో ఆ స్థాయి చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌తో చేయనున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమాతోనైనా కంటెంట్‌పై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

By:  Gopi Velupala   |   15 Nov 2026 1:02 PM IST
త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...
X

అక్షరానికి హోదాను ఇచ్చిన రచయిత త్రివిక్రమ్.. కెరీర్ మొదట్లో మంచి కథలను రాసిన ఆయన కాలక్రమేనా దర్శకుడిగా మారి ప్రేక్షకులను అలరించే సినిమాలు చేశాడు. రీసెంట్ గా 'ఆదర్శ కుటుంబం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన సక్సెస్ ను సాధించారు. నిజానికి ఈ మూవీ త్రివిక్రమ్ స్థాయి సినిమా కాదనే విమర్శలు వచ్చినప్పటికి ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చడంతో సినిమా సక్సెస్ అయింది.

త్రివిక్రమ్ లో కసి తగ్గిందా?

ఒకప్పుడు మాటలతో ప్రేక్షకుడి మనసును గెలుచుకున్న త్రివిక్రమ్, ప్రస్తుతం ఆడియన్స్ లో స్పూర్తి నింపే మాటలే రాయడం లేదు. జల్సా లో 'యుద్ధం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు ఓడించడం'...ఖలేజా లో 'అద్భుతం జరగడానికి ముందు ఎవ్వరు గుర్తించరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు'. సన్నాఫ్ సత్యమూర్తి లో 'మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, బాలేనప్పుడు విలువలు మాట్లాడకూడదు'. అరవింద సమేత వీర రాఘవ లో 'చెప్పే మనిషిని బట్టి విషయం విలువే మారిపోతుంది'... ఇలాంటి డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్ ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఎందుకని ఒక్కటి కూడా గుర్తుంచుకునే డైలాగ్ రాయలేకపోతున్నాడు. ఆయన చేసిన కొన్ని సినిమాలు డైలాగ్స్ తోనే ప్రేక్షకులను మెప్పించాయి. వాటి వల్లే ఆడియన్స్ రిపిటెడ్ గా థియేటర్ కి వచ్చి సినిమా చూసేవాడు. టెలివిజన్ లో ఆయన మూవీస్ కి ఎక్కువ ఆదరణ దక్కడానికి కారణం ఆయన సినిమాల్లోని డైలాగులే.. ఇప్పుడు ఆయన మూవీస్ లో అవే కరువయ్యాయి. త్రివిక్రమ్ పూర్తి స్టాండర్డ్ లో మూవీ చేస్తే చూడాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...

ఎన్టీఆర్ మూవీలో కంటెంట్ ఉంటుందా?

భారీ యాక్షన్ సినిమాలకు ఆదరణ దక్కే సమయంలో కథలో కంటెంట్ ఉంటే ఒక్క ఫైట్ లేకపోయిన సినిమా చేసి సక్సెస్ సాధించవచ్చని ప్రూవ్ చేశాడు. అలాంటి ఆయన ఈ మధ్య అసలు కంటెంట్ గురించి పట్టించుకోవడం లేదు. ఈ జనరేషన్ లో వచ్చిన కొన్ని సినిమాల ఇన్స్పిరేషన్ తో ఆయన కథలను రాసుకుంటున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో చేయబోయే 'గాడ్ ఆఫ్ వార్ ' మూవీ విషయంలో అయిన కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఒకప్పటి త్రివిక్రమ్ మళ్లీ మాకు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. యాక్షన్ సినిమాలు తీయడానికి కొంతమంది దర్శకులు ఉన్నారు. కాబట్టి ఒకప్పటి మీ స్టైల్ ను అనుసరిస్తూ సినిమాలు తీయండి. అవి మీరు మాత్రమే చేయగలరు. మీ సినిమాల వల్ల మాకు డిప్రెషన్ లో ఉన్నప్పుడు బతుకు మీద ఆశ పుడుతుంది, నలుగురం కలిసినప్పుడు కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకోవడానికి బాగుంటుందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు... త్రివిక్రమ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తారు, వాళ్ల అభిమానులను అలరిస్తారా లేదా అనేది చూడాలి...