వీళ్ల స్నేహం అందరికీ ఆదర్శం
ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే సమయంలో త్రివిక్రమ్, సునీల్ లు పంజాగుట్టలోని ఒక చిన్న రూంలో అద్దెకు ఉండేవారు.
By: Ramesh Palla | 26 Oct 2026 8:12 PM ISTసినిమా ఇండస్ట్రీలో స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇలా అందరూ కలివిడిగా మాట్లాడుకున్నట్లు గా అనిపిస్తుంది, కానీ లోలోపల మాత్రం ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే తత్వం ఉంటుంది. ఒక హీరోకు హిట్ పడితే మరో హీరో జలస్ ఫీల్ కావడం, ఒక దర్శకుడు హిట్ కొడితే మరో దర్శకుడు అంతకు మించిన హిట్ కొట్టాలని కసిగా వర్క్ చేయడం, ఒక నిర్మాత సినిమాను మించి మరో నిర్మాత సినిమాను నిర్మించాలి అనుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. వీటన్నింటి మధ్య ఇండస్ట్రీలో స్వచ్చమైన స్నేహం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఇండస్ట్రీలో బందువులు, బందుత్వాలు కూడా పెద్దగా కనిపించవు, అలాంటి ఇండస్ట్రీలో త్రివిక్రమ్, సునీల్‌ల స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇద్దరూ కెరీర్ ఆరంభంలో ఎలా ఉన్నారో ఇప్పుడూ కూడా అలాగే తమ స్నేహం ను కంటిన్యూ చేస్తున్నారు.
స్టార్ కమెడియన్ సునీల్...
ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే సమయంలో త్రివిక్రమ్, సునీల్ లు పంజాగుట్టలోని ఒక చిన్న రూంలో అద్దెకు ఉండేవారు. వీరితో పాటు ఆర్పీ పట్నాయక్ సైతం రూమ్‌లో ఉండేవాడు. ఆ రూం నుంచే ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. సునీల్ స్టార్ కమెడియన్‌గా మారగా, త్రివిక్రమ్ టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో చేరాడు. ఆర్పీ పట్నాక్ సైతం ఒకానొక సమయంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. వారి వారి కెరీర్ లో దూసుకు పోతూ, బిజీ అయినప్పటికీ ఈ ముగ్గురు తమ స్నేహంను వీడలేదు. ముఖ్యంగా సునీల్, త్రివిక్రమ్ స్నేహం ఎంతో గొప్పదని ఇండస్ట్రీలో అనుకుంటూ ఉంటారు. త్రివిక్రమ్ వల్లే సునీల్ స్టార్ కమెడియన్ అయితే, సునీల్ వల్లే త్రివిక్రమ్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని అంటారు. వీరిద్దరి గురించి మరోసారి చర్చ జరగడంకు కారణం జగపతిబాబు హోస్టింగ్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో.
జగపతిబాబు టాక్ షో లో త్రివిక్రమ్...
ఈ టాక్ షో లో త్రివిక్రమ్, సునీల్‌లు హాజరు అయ్యారు. వీరితో పాటు తమన్ సైతం ఈ ఎపిసోడ్లో సందడి చేయడం జరిగింది. ఇప్పటికే జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్‌కి మంచి స్పందన వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సునీల్ మరియు త్రివిక్రమ్‌ల స్నేహం గురించి జగపతిబాబు సుదీర్ఘ సమయం పాటు చర్చించడంతో అంతా ఆ పార్ట్ కు ఫిదా అవుతున్నారు. ఇద్దరూ ఇప్పటికీ ఏరా.. ఒరేయ్ అనుకుంటూ పిలుచుకోవడం చూడముచ్చటగా అనిపించింది. సాధారణంగా స్నేహితులు అయినప్పటికీ ఇండస్ట్రీలో ఒక హోదాలో ఉంటే కచ్చితంగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం చేస్తారు. కానీ ఈ టాక్ షో లో మాత్రం త్రివిక్రమ్ ను సునీల్ ఒరేయ్ అంటూ పిలిస్తే... సునీల్ ను త్రివిక్రమ్ ఏరా అనడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్పీ పట్నాయక్ ను సైతం వీరిద్దరూ ఒరేయ్ అంటూ సంభోదించడంతో వీరి మధ్య ఉన్న స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆదర్శ కుటుంబం సినిమాతో...
సునీల్, త్రివిక్రమ్‌ల స్నేహం ఇండస్ట్రీ వారికి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రతి సందర్భంలో నిలిచారు. సునీల్, త్రివిక్రమ్ ఇద్దరూ ఇండస్ట్రీలో ఒకరి అండతో మరొకరు ఎదిగారు. ఒకరు ఎదిగిన తర్వాత మరొకరిని మర్చి పోలేదు. అంతే కాకుండా ఇద్దరు ఇప్పటికీ చాలా సన్నిహితంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఆదర్శ స్నేహితులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్లో భాగంగా వీరిద్దరూ ఈ టాక్ షో కు వెళ్లారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాను అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సునీల్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్, సునీల్ కాంబోలో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ కావాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు. మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.
