Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

గతంలో ఒక ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలని త్రివిక్రమ్ అనుకున్నప్పటికి అవి కార్య రూపం దాల్చలేదు. గురూజీ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న హీరోలు ఎవరంటే...

By:  Gopi Velupala   |   13 Oct 2026 11:00 PM IST
త్రివిక్రమ్ తో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
X

తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. చాలామంది దర్శకులు వైవిధ్యభరితమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. త్రివిక్రమ్ కెరియర్ మొదటి నుంచి కామెడీ యాక్షన్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నాడు. ప్రస్తుతం 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా చేశాడు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వర్క్ చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఒక ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలని త్రివిక్రమ్ అనుకున్నప్పటికి అవి కార్య రూపం దాల్చలేదు. గురూజీ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న హీరోలు ఎవరంటే...

రామ్

'దేవదాసు' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ మొదటి మూవీతోనే 'ఎనర్జిటిక్ స్టార్' గా పేరు సంపాదించుకున్నాడు. రామ్ వాళ్ళ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ ప్రముఖ ప్రొడ్యూసర్.. దానివల్ల రామ్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపించారు. గత 4 సంవత్సరాల క్రితం త్రివిక్రమ్ సైతం రామ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. స్రవంతి రవి కిషోర్ వల్లే త్రివిక్రమ్ కి సినిమా ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది. చాలా కాలం పాటు రవి కిషోర్ త్రివిక్రమ్ ను ఆదుకున్నాడు. రామ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ట్రై చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. రాబోయే రోజుల్లో తప్పకుండా రామ్ తో సినిమా చేస్తానని ఒక ఈవెంట్ లో త్రివిక్రమ్ చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. అటు రామ్ వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే, త్రివిక్రమ్ సైతం తన బిజీలో తను ఉన్నాడు... తొందర్లోనే వీళ్ళ మూవీ అనౌన్స్ మెంట్ వస్తే చూడాలని రామ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

నాగ చైతన్య

త్రివిక్రమ్ నితిన్ కాంబోలో వచ్చిన 'అఆ' సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత గురూజీ నాగచైతన్యతో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అందులో సమంత హీరోయిన్ గా చేస్తుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో గురూజీ సాటిస్ఫై కాకపోవడంతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేశారట. ఇక ఆ తర్వాత నాగచైతన్య తన ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ సైతం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు...

గురూజీ ఫ్యూచర్ లో అయిన ఈ హీరోలతో సినిమాలు చేస్తాడా? వాళ్ళిద్దరికి కెరియర్ బెస్ట్ మూవీస్ ను అందించగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే...