Begin typing your search above and press return to search.

ఆమెకు భయపడి గడ్డం తీయని త్రివిక్రమ్.. అసలు కథ ఏంటంటే?

తాజాగా విక్టరీ వెంకటేష్‌తో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ఈ సరదా ప్రశ్నకు త్రివిక్రమ్ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ చెప్పిన ఆసక్తికర సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

By:  Madhu Reddy   |   30 Sept 2026 11:31 AM IST
ఆమెకు భయపడి గడ్డం తీయని త్రివిక్రమ్.. అసలు కథ ఏంటంటే?
X

స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే మనకు టక్కున గుర్తువచ్చేది ఆయన స్టైలిష్ గడ్డం. ఎప్పుడూ ఒకేలా క్లాసీ లుక్‌లో కనిపించే ఆయన, అసలు క్లీన్ షేవ్ ఎందుకు చేసుకోరనే విషయంపై ఎప్పుడూ రకరకాల చర్చలు జరుగుతుంటాయి. తాజాగా విక్టరీ వెంకటేష్‌తో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో యాంకర్ సుమ అడిగిన ఈ సరదా ప్రశ్నకు త్రివిక్రమ్ తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ చెప్పిన ఆసక్తికర సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భార్యకు భయపడే గడ్డం తీయట్లేదా? :

సుమ అడిగిన ప్రశ్నకు త్రివిక్రమ్ చాలా సరదాగా బదులిచ్చారు. పెళ్లయిన కొత్తలో తన భార్య తనను గడ్డం లేకుండా చూసిందని, కానీ ఆ తర్వాత నుంచి తాను ఇలాగే ఉంటున్నానని చెప్పారు. ఒకవేళ తాను ఇప్పుడు గడ్డం తీసేస్తే, సొంత భార్య కూడా గుర్తుపట్టలేదని, "ఎవరు బాబు నువ్వు?" తలుపు తెరవదేమోనని సరదాగా భయపడి, అందుకే షేవ్ చేయడం మానేశానని నవ్వుతూ చెప్పారు.. ఆయన ఇచ్చిన ఈ ఫన్నీ ఆన్సర్‌తో ఇంటర్వ్యూలో ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.

పాస్‌పోర్ట్, ఆధార్‌లోనూ గడ్డంతోనే:

అసలు విషయం తేల్చేస్తూ సుమ.. మరి మీ ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌లో కూడా గడ్డంతోనే ఉంటారా అని ప్రశ్నించారు. దానికి త్రివిక్రమ్ స్పందిస్తూ.. అవును, తన అధికారిక పత్రాలన్నింటిలోనూ గడ్డంతో ఉన్న ఫోటోనే ఉందని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు గడ్డం తీసేస్తే ఎయిర్‌పోర్ట్ ఇమిగ్రేషన్‌లో అధికారులకు తాను గుర్తుపట్టలేక పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఎప్పుడూ ఇలాగే గడ్డంతోనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు.

అక్టోబర్ 9న 'ఆదర్శ కుటుంబం':

ప్రస్తుతం త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్ తో కలిసి 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47' అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా త్రివిక్రమ్ చెప్పిన ఈ కబుర్లు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

సినిమాల్లో మాటలతో మ్యాజిక్ చేసే త్రివిక్రమ్, రియల్ లైఫ్‌లోనూ తన మాటలతో అందరినీ ఎలా నవ్విస్తారో ఈ ఇంటర్వ్యూ మరోసారి నిరూపించింది. ఇక గడ్డం వెనుక ఇంత ఫన్నీ రీజన్ ఉందని తెలుసుకున్న ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ 9న రాబోతున్న త్రివిక్రమ్-వెంకీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.