ఆ కాంబినేషన్ మళ్లీ ఎందుకు సాద్యపడలేదు?
శ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణ సంస్థతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ది ఈనాటి బంధం కాదు.
By: Srikanth Kontham | 8 Jan 2026 10:00 PM ISTశ్రీ స్రవంతి మూవీస్ నిర్మాణ సంస్థతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ది ఈనాటి బంధం కాదు. గురూజీ డైరెక్టర్ గా కాకముందు రైటర్ గా ఆసంస్థలో కొన్ని సినిమాలు పని చేసారు. అదే సంస్థ త్రివిక్రమ్ ని డైరెక్టర్ గా కూడా లాంచ్ చేసింది. తరుణ్ , శ్రియ జంటగా నటించిన `నువ్వే నువ్వే` చిత్రానికి గురూజీ డైరెక్టర్. దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి చిత్రమదే. స్రవంతి మూవీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
రిలీజ్ అనంతరం భారీ విజయం సాధించింది. అలా మొదలైన గురూజీ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతుంది. `అతడు`, `జల్సా`, `ఖలేజా` ,` జులాయి`, `అత్తారింటికి దారేది`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `అఆ`,` అజ్ఞాత వాసి`, `అరవింద సమేత వీరరాఘ`, `అల వైకుంఠపురములో`, `గుంటూరు కారం` ఇలా హిట్ సినిమాలు అందించారు గురూజీ.
ఈ విజయవంతమైన చిత్రాలన్నింటినీ వేర్వేరు బ్యానర్లు నిర్మించాయి. వాటిలో ఎక్కువగా హాసిని, హారిక క్రియేషన్స్ లోనే ఉంటాయి. ఈ సంస్థ అధినేత రాధాకృష్ణ స్నేహితుడు కావడంతో? అతడితోనే ఎక్కువ సినిమాలు చేసారు. ఈ మధ్యలో ఎక్కడైనా మళ్లీ స్రవంతి మూవీస్ లో గురూజీ మరో సినిమా చేసారా? అంటే లేదనే చెప్పాలి. `నువ్వే నువ్వే` తర్వాత త్రివిక్రమ్ మళ్లీ ఆ బ్యానర్లో సినిమా చేయలేదు. ఈ మధ్యనే త్రివిక్రమ్ రచన చేసిన `నువ్వు నాకు నచ్చావ్` రీ రీలీజ్ సందర్భంగా రవి కిషోర్ తో ఆ పాత స్మృతుల్ని నెమర వేసుకోవడం మినహా మళ్లీ కలిసి పనిచేస్తున్నాం? అనే మాట ఎక్కడా చర్చలోకి రాలేదు.
కలిసి మరో సినిమా చేద్దామని నిర్మాత అడగలేదు. త్రివిక్రమ్ కూడా ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి స్రవంతి రవికిషోర్ స్వయానా పెదనాన్న అవుతారు. పెదనాన్న అండదండలోనే రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే రామ్ చాలా మంది స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసాడు. కానీ రామ్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పుడూ తెరపైకి రాలేదు. గురూజీ కి సమయం ఉందంటే? ఇతర హీరోల చిత్రాలకు కథలు అందించడం, లేదా రైటింగ్ సెక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయ త్నిస్తుంటారు.
కానీ రామ్ విషయంలో గురూజీ ఎక్కడా ఇన్వాల్స్ అయినట్లు కూడా లేదు. ఓ సందర్భంలో మాత్రం స్రవంతి రవికిషోర్ రామ్ -గురూజీ కాంబినేషన్ లో సినిమా తీయాలని తనకీ ఉందని, కానీ త్రివిక్రమ్ బిజీని చూసుకుని చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ కాంబోలో సినిమా అనే చర్చ జరగలేదు. మరికొత్త ఏడాదైనా అప్ డేట్ ఉంటుందా? అన్నది చూడాలి.
