Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం త్రివిక్రమ్ తనయుడు.. మొదలయ్యేది ఎప్పుడు?

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

By:  M Prashanth   |   11 Aug 2025 6:17 PM IST
ప్రభాస్ కోసం త్రివిక్రమ్ తనయుడు.. మొదలయ్యేది ఎప్పుడు?
X

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ సినిమా స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, ప్రీ ప్రొడక్షన్ పనులు, ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లాంటి కారణాలతో ఇంకా డిలే అవుతుంది. సెప్టెంబర్ లో పట్టాలెక్కనుందని సందీప్ ఇప్పటికే చెప్పారు.

అయితే సినిమాపై తాజాగా మరో క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొడుకు రిషీ మనోజ్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. స్పిరిట్ టీమ్ తో త్వరోలోనే జాయిన్ కానున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై సందీప్ నుంచి గానీ, స్పిరిట్ టీమ్ నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు.

రిషి కంటే ముందు మాస్ మహారాజ రవితేజ కుమారుడు మాధవన్ భూపతిరాజు.. స్పిరిట్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ కానున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, దీనిపై కూడా ఈరోజు వరకు స్పష్టత లేదు. త్రివిక్రమ్ కుమారుడు రిషి.. ఇప్పటికే స్వయంగా నిశాచరుడు అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించాడు. అలాగే ఇందులో నటించాడు కూడా. దీంతోపాటుగా స్టాగ్నేషన్ అనే మరో షార్ట్ ఫిల్మ్ కు ఎడిటర్ గా పనిచేశాడు.

అయితే రిషి, మాధవన్ అసిస్టెంట్ డైరెక్టర్లుగా స్పిరిట్ కు పనిచేయనున్నారా లేదా అవన్నీ ఉత్తి పుకార్లేనా అనేది సందీప్ రెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మాత్రం సినిమా స్ట్రిప్ట్ పై పని చేస్తున్నారు. కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తైతే.. తారగణం ఎంపిక ఉంటుంది. ఆ తర్వాత సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.

కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆయన కెరీర్ లో పోలీస్ గెటప్ వేయడం ఇదే తొలిసారి. అందుకే సినిమాపై ఫుల్ బజ్ ఉంది. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపికైంది. భద్రకాళీ ప్రొడక్షన్ బ్యానర్ పై టీ సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాయి. హర్షవర్థన్ సంగీతం అందించనున్నారు.