Begin typing your search above and press return to search.

కృష్ణవంశీ సముద్రంకు త్రివిక్రం పనిచేశారా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా స్టార్ రేంజ్ అందుకున్నారు.

By:  Ramesh Boddu   |   30 Sept 2025 1:52 PM IST
కృష్ణవంశీ సముద్రంకు త్రివిక్రం పనిచేశారా..?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చి డైరెక్టర్ గా స్టార్ రేంజ్ అందుకున్నారు. ఐతే రైటర్ గా త్రివిక్రం తొలి సినిమా స్వయంవరం అని మాత్రమే చెప్పుకుంటాం ఆయన ఫిల్మోగ్రఫీ లో సముద్రం సినిమా ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. జగపతి బాబు, సాక్షి శివానంద్ జంటగా నటించిన సినిమా సముద్రం. కృష్ణవంశీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కించారు. 1999లో ఈ సినిమా వచ్చింది. ఈ మూవీని జె భగవాన్, డివివి దానయ్య నిర్మించారు.


జగపతి బాబు, కృష్ణవంశీ కలయికలో..

జగపతి బాబు, కృష్ణవంశీ కలయికలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాతే కృష్ణవంశీ జగపతి బాబుతో అంతపురం సినిమా చేశారు. ఐతే సముద్రం సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే కృష్ణవంశీ రాశారు. స్క్రీన్ ప్లే లో సత్యానంద్ హెల్ప్ చేశారు. ఐతే ఈ సినిమాకు డైలాగ్స్ మాత్రం శోభన్ రాశారు.


ఐతే ఈ సినిమా రైటింగ్ టీం లో త్రివిక్రం కూడా ఉన్నాడు. దీనికి సంబందించిన కొన్ని ఒకప్పటి ఫోట్స్ బయటకు వచ్చాయి. యంగ్ లుక్ లో త్రివిక్రం లుక్స్ బాగున్నాయి. కృష్ణవంశీ, త్రివిక్రం సముద్రం సినిమా టైం ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సముద్రం సినిమా రైటింగ్ టీం లో త్రివిక్రం ఉన్నాడు. ఐతే సినిమా క్రెడిట్స్ లో త్రివిక్రం పేరు ఉంటుంది కానీ ఆయన ఫిల్మోగ్రఫీ వికీపీడియా రికార్డ్స్ లో మాత్రం సముద్రం లేదు.

లాస్ట్ ఇయర్ వచ్చిన గుంటూరు కారం..

ఐతే త్రివిక్రం రైటర్ గా స్వయంవరం తొలి సినిమా ఆతర్వాత నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి సినిమాలకు డైలాగ్స్ రాశారు. 2002 లో నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్ గా మారారు త్రివిక్రం అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన గుంటూరు కారం వరకు త్రివిక్రం తన డైరెక్షన్ తో స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లానింగ్ ఉంది.

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ ఇప్పుడు అసలేమాత్రం ఫాం లో లేరు. ఆయన రంగమార్తాండ సినిమాతో కంబ్యాక్ ఇస్తారని అనుకోగా అది కుదరలేదు. అప్పుడు రైటర్ గా కొత్త జర్నీ స్టార్ట్ చేసిన త్రివిక్రం మాత్రం ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా వరుస స్టార్ సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. త్రివిక్రం సినిమా అంటే చాలు స్టార్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. వెంకటేష్ తో సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ ఎన్టీఆర్ తో కెరీర్ లో ఫస్ట్ టైం మైథాలజీ టచ్ ఇస్తూ గురూజీ పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు.