త్రివిక్రమ్ లెక్క తెల్చేసిన నిర్మాత!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాల నిర్మాణ శైలి .. ఆయన పారితోషికాల గురించి ఎప్పుడూ ప్రత్యేకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది.
By: Srikanth Kontham | 8 Aug 2026 11:33 PM ISTతెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాల నిర్మాణ శైలి .. ఆయన పారితోషికాల గురించి ఎప్పుడూ ప్రత్యేకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. మాటల మాంత్రికుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్న త్రివిక్రమ్ సినిమాల ఆర్థిక లావాదేవీల గురించి తాజాగా నిర్మాత నాగవంశీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ , సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ల మధ్య త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ సినిమాల నిర్మాణంలో ప్రధానంగా రెండు ప్రముఖ బ్యానర్లు భాగం అవుతుంటాయి.
ఇందులో రాధాకృష్ణ (చినబాబు) అధ్వర్యంలోని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్ కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే వ్యవహరిస్తుంటారని నాగవంశీ తెలిపారు. ఈ బ్యానర్‌లో ఆయనకు ఎలాంటి లాభాల్లో వాటా ఉండదని, కేవలం నిర్ణీత పారితోషికం లెక్క ప్రకారమే సినిమాలు చేస్తుంటారని స్పష్టం చేశారు. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని నాగవంశీ వివరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ -ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో త్రివిక్రమ్ భాగస్వామిగా ఉన్నారని అక్కడ ఆయన డైరెక్టర్ మాత్రమే కాకుండా చిత్రాల లాభాల్లో వాటాదారుడిగా కూడా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
ఈ రెండు నిర్మాణ సంస్థల మధ్య ఉన్న అధికారిక .. స్పష్టమైన ఆర్థిక ఒప్పందాల గురించి నాగవంశీ వివరంగా వెల్లడించారు. సినీ వర్గాల్లో త్రివిక్రమ్ పారితోషికం - బిజినెస్ డీల్స్ గురించి తరచూ రకరకాల రూమర్స్ వినిపిస్తుంటాయి. కానీ ఆయన ప్రతి ప్రాజెక్ట్‌ను ఎంతో లెక్కలేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకె ళ్తారనడానికి ఈ నిర్మాణ భాగస్వామ్యాలే నిదర్శనం. పెద్ద సినిమాలను నిర్మించేటప్పుడు నిర్మాతల ఆర్థిక భారాన్ని తగ్గించేలా అదే సమయంలో తన అనుభవంతో ప్రాజెక్ట్‌కు గ్యారెంటీ తెచ్చేలా త్రివిక్రమ్ వ్యవహరించే తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
సృజనాత్మక రంగంలో పనిచేస్తూనే వ్యాపార పరమైన లెక్కల్లో కూడా స్పష్టత ఉండటం వల్లనే త్రివిక్రమ్ సినిమాలు సురక్షితమైన జోన్లలో ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడిగా ప్రతిభను చాటుకుంటూనే నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన వేసే ప్రతి అడుగు ఇండస్ట్రీలో గురూజీకి ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపె డుతోంది. నాగవంశీ ఇచ్చిన తాజా క్లారిటీతో త్రివిక్రమ్ సినిమాల నిర్మాణం వెనుక ఉన్న అసలు లెక్కలేంటో? అందరికీ ఓ అవగాహన వస్తుంది. అలాగే హాసినీ-హారిక క్రియేషన్స్ సంస్థలో కేవలం త్రివిక్రమ్ తోనే సినిమాలు నిర్మిస్తామన్నారు. బ్యానర్ లోగోను కూడా ఆయనే డిజైన్ చేసారని నాగవంశీ తెలిపారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ సంస్థ త్రివిక్రమ్ కి అంకితం చేసినట్లు తెలిపారు.
మొత్తానికి టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన కాంబినేషన్‌లను సెట్ చేయడంలో సిద్ధహస్తుడైన త్రివిక్రమ్, తన నిర్మాణ భాగస్వామ్యాల విషయంలో కూడా ఎంతో స్పష్టమైన విధివిధానాలను పాటిస్తున్నారని రుజువైంది. భవిష్యత్తులోనూ ఈ బ్యానర్ల ద్వారా రాబోయే సంచలన ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.
