'అన్నిట్లో వేలు పెట్టొద్దు బాబూ'.. త్రివిక్రమ్ క్లాస్!
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 30 Dec 2025 1:08 PM ISTటాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో విజయవంతమైన దర్శక నిర్మాత ద్వయం వాళ్లది. వారిద్దరూ కలిసి ఇప్పటి అనేక ప్రాజెక్టులకు పనిచేశారు.. ఇప్పుడు పనిచేస్తున్నారు కూడా. అలా స్ట్రాంగ్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకుడిగా, రచయితగా పనిచేస్తుండగా.. ఆయన సతీమణి సాయి సౌజన్యతో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సినిమాలు నిర్మిస్తున్నారు నాగవంశీ. అయితే రీసెంట్ గా ఆయనకు త్రివిక్రమ్ క్లాస్ పీకారట! పలు సలహాలు ఇచ్చారట. ఆ విషయాన్ని స్వయంగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మరికొద్ది రోజుల్లో నాగవంశీ నిర్మిస్తున్న అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా జనవరి 14న విడుదల అవ్వనుంది. దీంతో నాగవంశీ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఆ సమయంలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు.
అందులో భాగంగా ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన సలహాల గురించి ప్రస్తావించారు. 2025 సెకండాఫ్ లో మా సంస్థ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు సరిగా ఆడలేదని గుర్తు చేసుకున్నారు నాగవంశీ. ఆ విషయంపై త్రివిక్రమ్ గారు తనతో మాట్లాడారని చెప్పారు. అన్నిట్లో వేలు పెట్టొద్దని సూచించినట్లు వెల్లడించారు.
"త్రివిక్రమ్ గారు.. మనకంటూ ఒక కోర్ జానర్ ఉందని కదా అని నాతో అన్నారు. అందుకే దాన్ని నమ్ముకొని మనం ముందుకు వెళదామని చెప్పారు. ఆడియన్స్ కూడా ఆ విషయంలో మనల్ని నమ్ముతున్నారని అన్నారు. ముఖ్యంగా వీళ్లు జానర్ అయితే చాలా బాగా చేస్తారు అనే నమ్మకం వచ్చిందని చెప్పారు" అని నాగవంశీ తెలిపారు.
అందుకే ఆ జానర్ ను మిస్ చేయకూడదని, అందుకే, అదే స్పేస్ లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నాగవంశీ చెప్పారు. ఇక నుంచి ప్రయోగాలు చేయకుండా.. మనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని త్రివిక్రమ్ తనతో అన్నట్లు తెలిపారు. ఆ విధంగా ఇప్పుడు తాము ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా అంటేనే కచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ జోనర్ లో ఆయన అనేక సినిమాలు తీయగా.. మంచి హిట్స్ గా నిలిచాయి. దీంతో ఇప్పుడు తాజా కామెంట్స్ తో ఆ జోనర్ టచ్ చేస్తూనే ఫ్యూచర్ లో త్రివిక్రమ్, నాగవంశీ సినిమాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.
