Begin typing your search above and press return to search.

గురూజీకి పాన్ ఇండియా ఎంత కీల‌క‌మంటే?

తెలుగు బాక్సాఫీస్‌పై తనదైన ముద్ర వేసిన దర్శకుడు త్రివిక్రమ్‌కు ఎన్టీఆర్‌తో తెరకెక్కించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ కీలక ప్రాజెక్ట్‌గా మారింది. రొటీన్ కథలనే ఎంచుకుంటున్నారనే విమర్శల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ వంటి దర్శకుల సరసన త్రివిక్రమ్ పేరు నిలిచే అవకాశం ఉంది. లేదంటే ఆయన మార్కెట్‌పై ప్రభావం పడుతుందనే చర్చ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   16 Nov 2026 4:57 PM IST
గురూజీకి పాన్ ఇండియా ఎంత కీల‌క‌మంటే?
X

టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడుగా అప్రతిహతమైన విజయాలను సాధించిన త్రివిక్రమ్ కెరీర్‌కిప్పుడు కీలకమైన మలుపు ఎదురైంది. దశాబ్దాలుగా తెలుగు బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ కామెడీ.. పదునైన సంభాషణలతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన గురూజీపై కొంత కాలంగా రీజనల్ మార్కెట్‌లో రొటీన్ కంటెంట్ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా తీసినా? ఆయన మార్క్ డైలాగులు.. ఫ్యామిలీ సెంటిమెంట్లు తప్ప కథాకథనాలలో కొత్తదనం కొరవడుతోందనే అభిప్రాయం విమర్శకుల్లో నిత్యం చర్చనీయాంశ‌మే.

ఈ నేప‌థ్యంలో త్రివిక్రమ్ శైలిని పూర్తిగా మార్చుకుని పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. తెలుగు బాక్సాఫీస్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల పల్స్ పట్టుకునేలా గురూజీ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. టాలీవుడ్ స్థాయిని దాటి ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అన్ని వర్గాల ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలంటే? కేవలం మాటల గారడీ సరిపోదని గ్లోబల్ అప్పీల్ ఉన్న కథాంశం ఉండాలని క‌సిగానే ఓ స్టెప్ తీపుకున్నారు.

ఈ నేప‌థ్యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో `గాడ్ ఆఫ్ ది వార్` కి పూనుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ కెరీర్‌కు అగ్నిపరీక్ష లాంటిదనే చెప్పాలి. ఒకవేళ ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజ యాన్ని అందుకోలేకపోతే ఆ ప్రభావం గురూజీ మార్కెట్‌పై గట్టిగానే పడే ప్రమాదముంది. నేడు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ప్రతీ దర్శకుడు జాతీయ స్థాయి గుర్తింపు కోసం పాకులాడుతున్న సమయంలో త్రివిక్రమ్ లాంటి దిగ్గజ డైరెక్టర్ కూడా ఈ రేసులో సత్తా నిరూపించుకోవాల్సిన స‌న్నివేశం అంత‌కంత‌కు బ‌ల‌ప‌డుతుంది.

ఒకవేళ ఈ ప్రయత్నంలో ఆశించిన ఫలితం రాకపోతే టాలీవుడ్ లో ఆయన మళ్లీ పూర్తిగా రీజనల్ సినిమాలకే పరిమితం కావాల్సి వస్తుందనే గుసగుసలు వినిపి స్తున్నాయి. గతంలో తెలుగు నేటివిటీని నమ్ముకుని చేసిన చిత్రాలు భారీ వసూళ్లు సాధించినా? మారుతున్న కాలానికి తగినట్లుగా పాన్ ఇండియా ట్రెండ్‌ను అందు కోలేకపోతే సీనియర్ డైరెక్టర్లు సైతం రేసులో వెనుకబడిపోయే ప్రమాదం ఉందనే వాదన బలంగా ఉంది.

హిట్ అయితే గురూజీ క్రేజ్ తో ఇండియాని షేక్ చేయ‌డం అంతే వాస్త‌వం. బాలీవుడ్ స‌హా కోలీవుడ్ హీరోలంతా గురూజీ కోసం వంద మెట్లు అయినా దిగొస్తారు. రాజ‌మౌళి, ప్ర‌శాంత్ నీల్, సుకుమార్ స‌ర‌స‌న గురూజీ పేరు లిఖించ‌ప‌ డుతుం దన్న‌ది అంత‌కు మంచిన వాస్త‌వం. ఇప్ప‌టికే బాలీవుడ్...కోలీవుడ్ హీరోలు తెలుగు డైరెక్ట‌ర్ల‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి వాళ్లంద‌రికీ గురూజీ అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుంది.