Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ఆ స్టోరీ కోసం కోటి రూపాయలు తీసుకున్నాడా?

రైటర్స్ పోటెన్షయాలిటీని పెంచిన రచయిత త్రివిక్రమ్... ఆయన రాసే ఎమోషనల్ డైలాగ్స్ కి ఎవ్వరి మనసైన కరిగిపోవాల్సిందే.

By:  Gopi Velupala   |   6 Oct 2026 10:18 AM IST
త్రివిక్రమ్ ఆ స్టోరీ కోసం కోటి రూపాయలు తీసుకున్నాడా?
X

రైటర్స్ పోటెన్షయాలిటీని పెంచిన రచయిత త్రివిక్రమ్... ఆయన రాసే ఎమోషనల్ డైలాగ్స్ కి ఎవ్వరి మనసైన కరిగిపోవాల్సిందే. తను వేసే పంచ్ లకు ప్రేక్షకుడి పొట్ట చెక్కలవాల్సిందే. బంధాలు-బంధుత్వాలు, ప్రేమలు-ఇష్టాలు, విలువలు -సాంప్రదాయాలే ఆయన సినిమాలు. కొన్ని సంవత్సరాల పాటు తన పెన్ను తో ఇండస్ట్రీ ని ఏలాడు... తను చదివిన పుస్తకాల ప్రభావంతో చాలా ఈజీ గా ఒక సీన్ లో డెప్త్ ను క్రియేట్ చేస్తాడు. సీన్ లోని ఇంటెన్స్ ను ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేస్తాడు. ఎప్పుడైనా ఒక గొప్ప రచయిత ఒక మంచి దర్శకుడు అవుతాడనే మాటకి ఎగ్జైంపుల్ ను సెట్ చేసిన దర్శకుడు... ఇండస్ట్రీ లో రైటర్స్ కి వాల్యూ లేదనే మాట నుంచి రైటర్ లేకపోతే సినిమా లేదనే స్థాయి కి తీసుకువచ్చిన రచయిత త్రివిక్రమ్...

స్టోరీ కి కోటి రూపాయలు తీసుకున్నాడా...

నువ్వు నాకు నచ్చావ్ మూవీ సక్సెస్ త్రివిక్రమ్ ను ఆల్ టైమ్ ది బెస్ట్ రైటర్ ను నిలబెట్టింది. ఈ మూవీతో ఆయన జాతకం మారిపోయింది. చాలా మంది ప్రొడ్యూసర్స్ త్రివిక్రమ్ కథ కోసం ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. అదే టైంలో 'మన్మధుడు' కథ త్రివిక్రమ్ దగ్గర ఉందని తెలుసుకున్న నాగార్జున ఆ స్టోరీ విన్నాడట. సింగిల్ సిట్టింగ్ లోనే నాగార్జున ఇంప్రెస్ అయిపోయాడట. హీరో పాత్రలో ఉన్న ఎగ్జైట్ మెంట్ నచ్చి త్రివిక్రమ్ కి కోటి రూపాయలు ఇచ్చి నాగార్జున ఆ స్క్రిప్ట్ ను తీసుకున్నాడట. దమ్మున్న కథ రాస్తే రైటర్లకు కోటి రూపాయలు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ గా ఉందని త్రివిక్రమ్ ప్రూవ్ చేశాడు. అలాగే రైటర్స్ స్టాండర్డ్ పెంచిన రచయిత గా త్రివిక్రమ్ గొప్ప కీర్తి ప్రతిష్టలను అందుకున్నాడు. నాగార్జున చేసిన మన్మధుడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తన క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు.

నాగార్జున క్యారెక్టర్ కి ఆడవాళ్లంటే నచ్చదు. దానికి బలమైన కారణాన్ని సెకండాఫ్ లో రాసుకున్నాడు. అప్పుడున్న ప్రేక్షకుల మైండ్ సెట్ ప్రకారం హీరో స్త్రీలను ద్వేషించడం అనేది ఒక రకంగా సాహాసమనే చెప్పాలి. కొంచెం తేడా వచ్చిన క్యారెక్టర్ పూర్తిగా నెగెటివ్ అయ్యే ప్రమాదం ఉంది. త్రివిక్రమ్ వీటన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్ స్టోరీ డైలాగ్స్ ను అందించాడు. మొత్తానికి ఇలా సింపుల్ గా ఒక లవ్ స్టోరీ రాసి అందులో కామెడీ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి సక్సెస్ ను సాధించవచ్చా? అనేలా ప్రేక్షకుడు సినిమా చూసే దృష్టి కోణాన్ని మార్చేసిన రచయిత త్రివిక్రమ్...