Begin typing your search above and press return to search.

'ఆదర్శ కుటుంబం'తో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌..!

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబో మూవీ ప్రకటించిన వెంటనే తమిళ్‌ స్టార్‌ హీరో ధనుష్ నుంచి కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది.

By:  Ramesh Palla   |   27 Oct 2026 3:02 PM IST
ఆదర్శ కుటుంబంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌..!
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందిన 'ఆదర్శ కుటుంబం' సినిమా అక్టోబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. దాదాపు రెండు దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ ఎట్టకేలకు రూపొంది ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్‌ తర్వాత సినిమా గురించి క్లారిటీ వచ్చింది. ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్‌ సమయంలోనే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విడుదల చేయడం ద్వారా త్రివిక్రమ్‌ సినిమాపై అంచనాలు పెంచాడు. వార్‌ ఆఫ్ గాడ్‌ అనే క్యాప్షన్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు అనే ప్రకటన వచ్చింది.

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ....

త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ కాంబో మూవీ ప్రకటించిన వెంటనే తమిళ్‌ స్టార్‌ హీరో ధనుష్ నుంచి కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ధనుష్‌ అండ్‌ టీం ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభించారనే వార్తలు వచ్చాయి. ధనుష్‌ చేస్తున్న సినిమా కథనే మళ్లీ త్రివిక్రమ్‌ ఎలా చేస్తాడనే ఉద్దేశంతో చాలా మంది ఎన్టీఆర్‌ మూవీ క్యాన్సల్‌ అయినట్లే అని భావిస్తున్నారు. పైగా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దాంతో సినిమా లేనట్లే అనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ సమయంలో త్రివిక్రమ్‌ నుంచి వచ్చిన స్పందన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి పెద్ద గుడ్‌ న్యూస్‌ అనడంలో సందేహం లేదు. ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్‌లో భాగంగా త్రివిక్రమ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తాను చేయబోతున్న సినిమా గురించి ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. సినిమాపై ఉన్న అనుమానాలన్నింటికి చెక్ పెట్టాడు.

ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్స్‌...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ రెండు విషయాలపై స్పష్టత ఇచ్చాడు. సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో ఉన్న పద్యం గురించి త్రివిక్రమ్‌ మొదటి సారి స్పందించాడు. షణ్ముఖుడి ప్రేరణతోనే ఈ సినిమా రూపొందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అతి త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించాడు. ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమా ప్రమోషన్‌తో బిజీగా ఉన్న కారణంగా త్రివిక్రమ్‌ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పై దృష్టి పెట్టలేక పోతున్నాడు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఇదే ఏడాది చివరి నుంచి ఎన్టీఆర్‌తో షూటింగ్‌ సైతం ప్రారంభించే అవకాశాలు లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆయన మాటలు సైతం అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు.

ధనుష్ హీరోగా మురుగన్‌ మూవీ...

ధనుష్‌ సైతం మురుగన్‌ నేపథ్యంలో సినిమా చేస్తున్న విషయమై దర్శకుడు త్రివిక్రమ్‌ స్పందించాడు. మురుగన్‌ కేవలం తమిళ జనాలకు మాత్రమే దేవుడు కాదని, మొత్తం దక్షిణ భారతీయులందరికీ మురుగన్‌ దేవుడు అన్నాడు. దాంతో ధనుష్ సినిమా వస్తున్నా, మాకు కూడా సినిమా చేసే అర్హత ఉంది అన్నట్లుగా త్రివిక్రమ్‌ చెప్పకనే చెప్పాడు. ఎన్టీఆర్‌ వంటి మాస్‌ స్టార్ హీరోతో సినిమా కనుక కచ్చితంగా భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. పైగా పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ చాలా కాలంగా వీరి కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివర్లో లేదా 2028లో వీరి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందబోతుంది. ఇక హీరోయిన్‌ విషయమై అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.