ఆ మూవీ ఉన్నట్లా? లేనట్లా? ఏంటీ కన్ఫ్యూజన్?
కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నా.. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడం లేదు. దీంతో అంతా ఆ ప్రాజెక్టు కోసం డిస్కస్ చేసుకుంటున్నారు.
By: M Prashanth | 10 March 2026 10:51 AM ISTఏ సినిమా.. ఏ కథ.. ఏ డైరెక్టర్ తో ఏ హీరో వర్క్ చేయాలన్నది రాసిపెట్టి ఉండాలని అంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా డైరెక్టర్.. స్క్రిప్ట్ తోపాటు అన్నీ రెడీ చేసుకున్నా కూడా.. ఎవరితో వర్క్ చేయాలని రాసిపెట్టి ఉంటే వారితోనే చివరకు పని చేస్తారు. ఆ స్టోరీ చేరాల్సిన చోటుకు చేరుతుంది. కానీ ఇప్పుడు ఓ ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాసుకున్న కథతో సినిమా రూపొందుతుందా.. తెరకెక్కితే ఎవరితో అన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నా.. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావడం లేదు. దీంతో అంతా ఆ ప్రాజెక్టు కోసం డిస్కస్ చేసుకుంటున్నారు.
అదేంటంటే.. గాడ్ ఆఫ్ వార్. కుమారస్వామి కథ ఆధారంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. నిర్మాతను కూడా దాదాపు ఫిక్స్ చేసుకున్నట్లేనని చెప్పాలి. కానీ ఆ మూవీపై ఇప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. హీరో ఎవరో తెలియదు. నిజానికి.. ఆల్మోస్ట్ హీరో ఫిక్స్ అయిపోయారని రీసెంట్ గా వార్తలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ పోషిస్తారని టాక్ వినిపించింది.
యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్లు.. తారక్ మురుగన్ పుస్తకంతో కనిపించడం.. వంటి పలు సంఘటనల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోనే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ చేస్తారని ఆల్మోస్ట్ అంతా ఫిక్స్ అయ్యారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని అనుకున్నారు. కానీ ఇంతలో అల్లు అర్జున్ వద్దకు ప్రాజెక్టు వెళ్లిందని గుస గుసలు వినిపించాయి. నిజానికి బన్నీ వదులుకున్నాకే తారక్ వద్దకు స్క్రిప్ట్ వచ్చిందని అప్పట్లో టాక్ వచ్చింది.
కానీ అల్లు అర్జున్ మళ్లీ ఓకే చెప్పారని ప్రచారం జరిగింది. అదంతా ఒకెత్తు అయితే.. ఈ మధ్య ఏకంగా ప్రాజెక్టును త్రివిక్రమ్ పక్కన పెట్టేశారని కూడా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అటు బన్నీ.. ఇటు తారక్ తో త్రివిక్రమ్ మంచి అనుబంధం ఉండగా.. వేర్వేరుగా పవర్ ఫుల్ స్క్రిప్టులతో రెండు సినిమాలు చేద్దామనుకున్నారని వార్తలు వచ్చాయి. గాడ్ ఆఫ్ వార్ ను ఇకపై చేయరని రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి.
దీంతో గాడ్ ఆఫ్ వార్ సినిమా విషయంలో ఏంటి రా బాబు.. ఈ కన్ఫ్యూజన్ అంటూ నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఒకసారి తారక్ అంటారు.. మరోసారి బన్నీ అంటారు.. ఇంకోసారి ప్రాజెక్టే లేదని అంటారు.. ఆ ప్రాజెక్టు పై క్లారిటీ ఇవ్వకపోవడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఆ సినిమా ఉంటుందా లేదోనని డౌట్ కూడా పడుతున్నారు. మరి ఆ ప్రాజెక్టు విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
