బాలయ్య, త్రివిక్రమ్ కాంబో.. ఎందుకు సెట్టవ్వలేదు?
అచ్చం అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- నందమూరి బాలకృష్ణ కాంబో సెట్ అయినట్లే అయ్యి, మళ్లీ బ్రేక్ పడింది.
By: M Prashanth | 18 Oct 2025 10:09 AM ISTపరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రాజమౌళి- ప్రభాస్, రాజమౌళి- ఎన్టీఆర్, సుకుమార్- అల్లు అర్జున్ ఇలాంటి డైరెక్టర్ - హీరో కాంబినేషన్ లు టాలీవుడ్ లో బాగానే సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే మరికొన్ని కాంబినేషన్ లు మిస్ అవుతాయి కూడా. ఎన్నిసార్లు కలిసి సినిమా చేయాలనుకున్నా.. అది కొన్ని కారణాల వల్ల కుదరదు. అచ్చం అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- నందమూరి బాలకృష్ణ కాంబో సెట్ అయినట్లే అయ్యి, మళ్లీ బ్రేక్ పడింది.
100కు పైగా సినిమాలు తీసిన బాలయ్యతో త్రివిక్రమ్ మాత్రం సినిమా తీసే అవకాశం రాలేదు. అప్పట్లో ఓ సారి వచ్చినా, అది వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇంతకీ ఆ కథేంటంటే అనే వివరాల్లోకి వెళితే, 2000ల్లో డైరెక్టర్ త్రివిక్రమ్ మంచి సినిమాలు తీశారు. బ్లాక్ బస్టర్లకు రైటర్ గానూ పనిచేశారు. ఆయన రచయితగా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట సినిమాలకు డైలాగ్స్ రాసి తన పెన్ను పవర్ చూపించారు.
అయితే డైరెక్టర్ కాకముందు త్రివిక్రమ్ దర్శకుడు విజయ్ భాస్కర్ వద్ద రచయిత గా పనిచేశారు. నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి సినిమాలకు ఆయన అందించిన డైలాగులు, పంచ్ లు పీక్స్ అసలు. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు మిస్ అవ్వరు. ఈ సినిమాలు అప్పట్లోనే క్లాసిక్స్ గా హిట్ అయ్యాయి. ఇక 2002లో నువ్వే నువ్వే సినిమాతో త్రివిక్రమ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మహేష్ బాబుతో అతడు, ఖలేజా, పవన్ కల్యాణ్ జల్సా సినిమాలు తెరకెక్కించారు. మరోవైపు విజయ్ భాస్కర్ కూడా తనతన ప్రాజెక్ట్ లతో బిజీగా అయిపోయారు.
బాలయ్యతో సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ ఈ కారణం వల్ల ఈ ఇద్దరూ బాలయ్యను డైరెక్ట్ చేయలేకపోయారు. ఈ విషయాన్ని తానే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన బి గోపాల్ తెరకెక్కించిన లారీ డ్రైవర్ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారట. ఆయన పనితనం, నిబద్ధత బాలయ్యకు తెగ నచ్చేశాయట. అందుకే ఆయనకతో సినిమా చేస్తానని అప్పుడే మాట ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఓ సారి ఫోన్ చేసి మరీ సినిమా కోసం అడిగారట.
అప్పటికే త్రివిక్రమ్ కూడా ఆయన టీమ్ లో రైటర్ గా చేరారు. దీంతో సినిమా పట్టాలెక్కించాలని సన్నాహాలు చేశారు. కానీ ఈ కాంబో సెట్ అవ్వలేదు. ఎందుకంటే.. విజయ్ భాస్కర్ అప్పుడు మల్లీశ్వరి సినిమా చేస్తుండడంతో బాలయ్య సినిమా పోస్ట్ పోస్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ మాత్రం ఇద్దరికీ రాలేదు. ఈ ఇద్దరితో పాటు మరోవైపు బాలయ్య కూడా తమ తమ సినిమాలతో బిజీగా ఉండడంతో కుదరలేదు. కానీ, త్రివిక్రమ్- బాలయ్య కాంబోలో రైటర్ గా అయినా సినిమా పడి ఉంటే అదిరిపోయేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్రివిక్రమ్ డైలాగ్ లో పంచ్, బాలయ్య డైలాగ్ డెలివరీ పవర్ అన్నీ ఒక సినిమాలో ఉండి ఉంటే మాస్, క్లాస్ థియేటర్లు బద్దలయ్యేవని కామెంట్లు చేస్తున్నారు. మరి ఫ్యూచర్ లో అయినా ఈ కాంబో సెట్టవుతుందో లేదో చూడాలి.
