Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ ఆ విషయంలో చాలా సేఫ్ గా ఉంటాడా? ఆదర్శ కుటుంబం పరిస్థితేంటి?

త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసిన సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఆయన స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని సగటు ప్రేక్షకులందరికీ నచ్చేలా తన సినిమాను డిజైన్ చేస్తుంటాడు.

By:  Gopi Velupala   |   15 Oct 2026 12:12 PM IST
త్రివిక్రమ్ ఆ విషయంలో చాలా సేఫ్ గా ఉంటాడా? ఆదర్శ కుటుంబం పరిస్థితేంటి?
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ ప్రేక్షకులను ఆయన ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాడు. తన మాటలతో మ్యాజిక్ చేస్తూ సినిమాని మొదటినుంచి చివరి వరకు బోర్ లేకుండా నడిపిస్తాడు. యాక్షన్ ఎపిసోడ్స్ కి సైతం పెద్ద పీట వేసినప్పటికి తన సినిమాలో ప్రధానంగా కామెడీ, ఎమోషనల్ డైలాగులు ఎక్కువగా ఎలివేట్ అవుతుంటాయి. మొత్తానికైతే హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా వేరియేషన్స్ ను చూపించడంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది...

సేఫ్ జోన్ లో త్రివిక్రమ్

త్రివిక్రమ్ ఏ హీరోతో సినిమా చేసిన సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఆయన స్క్రిప్ట్ ని రెడీ చేసుకొని సగటు ప్రేక్షకులందరికీ నచ్చేలా తన సినిమాను డిజైన్ చేస్తుంటాడు. ఆయనకి ఫ్లాప్ సినిమాలు అంటే భయం అందుకే మొదటి నుంచి తను చేసిన సినిమాల్లో చాలా ఎక్కువ పర్సెంట్ సక్సెస్ లు ఉండేలా చూసుకుంటున్నాడు. ఒకటి రెండు ఫ్లాప్ లను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడం త్రివిక్రమ్ మార్కెట్ ను మరింత పెంచింది. అందుకే ఆయన సేఫ్ జోన్ లో ఉంటూ సక్సెస్ లను సాధిస్తాడు. ఆడియన్స్ అతని సినిమాలను ఒక్కసారి చూసి వదిలి పెట్టరు రిపీటెడ్ గా చూడడానికి సైతం ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం.

ఆదర్శ కుటుంబం పరిస్థితి...

ప్రస్తుతం త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో 'ఆదర్శ కుటుంబం' మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీనే రిలీజ్ అవ్వాల్సింది, కానీ అనుకోని కారణాలవల్ల సినిమాని పోస్ట్ పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ విషయంలో సరైన క్లారిటీ రాలేదు. తొందర్లోనే ప్రొడ్యూసర్ నాగవంశీ అధికారికం గా ఈ మూవీ డేట్ ను అనౌన్స్ చేస్తాడట. త్రివిక్రమ్ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకుముందు మహేష్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' సినిమా అతనికి ఏమాత్రం గుర్తింపు తీసుకురాలేదు. రొటీన్ గా ఉందనే విమర్శలు వచ్చాయి. దాంతో తన రూట్ మార్చి ఫస్టాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలి. సెకండ్ హాఫ్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాలని 'ఆదర్శ కుటుంబం' సినిమాని తీశారట. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. త్రివిక్రమ్ పెన్ను పవర్ ఏంటో మరోసారి చూపిస్తుందా? తన మేకింగ్ వాల్యూస్ మరింత ఎలివేట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందా? ఈ మూవీ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి...