Begin typing your search above and press return to search.

ఒకే ఒక్క ఫోటోతో బ్రేకప్ రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష

ఈ బ్రేకప్ ప్రచారం పీక్స్ కు వెళ్లిన టైమ్ లో త్రిష సడెన్ గా ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా విజయ్ తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఒక ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

By:  M Prashanth   |   23 Jun 2026 9:04 PM IST
ఒకే ఒక్క ఫోటోతో బ్రేకప్ రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష
X

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, స్టార్ హీరోయిన్ త్రిషల పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉన్నాయి. వెండితెరపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ హిట్ పెయిర్, ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు. వీళ్ల చుట్టూ తిరుగుతున్న రూమర్స్ కు త్రిష లేటెస్ట్ గా ఒక పోస్ట్ మరింత హీట్ పెంచింది.

జూన్ 22న విజయ్ తన 52వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ప్రతి ఏడాదీ అతనికి విష్ చేస్తూ పోస్ట్ పెట్టే త్రిష, ఈసారి ఉదయం నుంచి సైలెంట్ గా ఉండటంతో నెట్టింట రకరకాల వార్తలు మొదలయ్యాయి. వీళ్లిద్దరి మధ్య గొడవ జరిగిందని, బ్రేకప్ అయిపోయిందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. దానికి తోడు త్రిష ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ ను అన్ ఫాలో చేసిందంటూ ప్రచారం చేశారు.

ఈ బ్రేకప్ ప్రచారం పీక్స్ కు వెళ్లిన టైమ్ లో త్రిష సడెన్ గా ఒక సర్ ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా విజయ్ తో కలిసి కేక్ కట్ చేస్తున్న ఒక ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముందున్న కేక్స్ చూస్తూ ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించారు. ఈ పిక్ కు "నా జీవితంలో ప్రతి దానికి అర్థం చెప్పే వ్యక్తికి హ్యాపీ బర్త్ డే" అంటూ త్రిష స్పెషల్ క్యాప్షన్ జత చేసింది. కాస్త లేట్ గా విషెస్ చెప్పినా ఈ పోస్ట్ తో రోజంతా జరిగిన ప్రచారానికి త్రిష గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయింది.

బ్రేకప్ అంటూ వచ్చిన రూమర్స్ కు స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కేవలం ఒకే ఒక్క ఫోటోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ పిక్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారి ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపింది. విజయ్ డివోర్స్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి త్రిష పేరు కూడా ఇంటర్నెట్ లో ప్రధానంగా వినిపిస్తోంది. ఈ రూమర్స్ ను పట్టించుకోకుండా ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి త్రిష హాజరైంది.

అలాగే అజిత్ వాళ్ల అమ్మగారు చనిపోయినప్పుడు కూడా ఇద్దరూ కలిసి పరామర్శించడానికి వెళ్లడం వీళ్ల బంధం గురించి జనాల్లో ఆసక్తిని పెంచింది. తమ రిలేషన్ షిప్ మీద సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా ఈ ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. తమ పర్సనల్ లైఫ్ విషయాలను చాలా సైలెంట్ గా హ్యాండిల్ చేస్తున్నారు. ఏదేమైనా పుట్టినరోజు నాడు రూమర్స్ కు చెక్ పెడుతూ త్రిష స్వయంగా పెట్టిన ఈ లేటెస్ట్ పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం సీఎంగా విజయ్ చాలా బిజీగా ఉన్నారు. ఇక విజయ్ ఆఖరి సినిమా అని చెప్పిన జననాయగన్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమా రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.