డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా? త్రిష పోస్ట్ ఎవరిని ఉద్దేశించి?
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 12 Aug 2026 2:27 PM ISTప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది . ఒకవైపు వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. మరొకవైపు తమిళనాడు రాజకీయాలలో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తాజాగా ఈమె డ్రామా చేయడం సిగ్గుగా అనిపించలేదా? అంటూ ఇన్స్టా స్టోరీ లో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందో తెలియదు కానీ.. నెటిజన్స్ మాత్రం దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత త్రిష రాజకీయాల్లో తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తోంది. పైగా కొంతమంది రాజకీయ ప్రముఖులు డైరెక్ట్ గానే త్రిష పేరును ప్రస్తావిస్తూ.. డబుల్ మీనింగ్ డైలాగులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.. సడన్గా త్రిష ఇప్పుడు తన అధికారిక ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక కొటేషన్ పంచుకుంది. "ఈ వయసులో అనవసరమైన డ్రామాలు చేయడం సిగ్గుచేటు.. వెళ్లి పనిచేసుకొని కొంత డబ్బు సంపాదించండి.. ప్రశాంతంగా జీవించండి". అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది. దీంతో అసలు త్రిష ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది ? అనే చర్చ మొదలయ్యింది.
అంతేకాదు మరొక పోస్టులో.." ఒకప్పుడు మనం ప్రార్ధించిన జీవితం ఇప్పుడు మనకు లభించడం ఎంతటి అదృష్టం" అంటూ మరో కొటేషన్ కూడా షేర్ చేసింది. అయితే ఇందులో త్రిష ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అనే విషయాన్ని నేరుగా ప్రస్తావించలేదు. దీంతో ఈమె వ్యాఖ్యలు ఏ వివాదానికి సంబంధించినవి.. ఎవరికి కౌంటర్ గా పెట్టారో అధికారికంగా స్పష్టత లేకపోవడంతో నెటిజన్స్ పలువురి పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు.
ఇకపోతే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి త్రిష పేరు ఆయనతో ముడి పెడుతూ సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు సాగుతున్నాయి.. ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అటు విజయ్ భార్య సంగీతా త్రిష పేరును ప్రస్తావించకుండా తన భర్త ఒక సినీ నటితో ఉంటున్నాడని చెబుతూ గత ఏడాది చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులు కూడా కోరింది.. కానీ ఇటీవల వీడియో కాల్ లో విచారణకు హాజరైన ఈమె.. తన విడాకుల పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
అటు ప్రముఖ రాజకీయ నేత ఉదయనిధి కావేరి జలాల ప్రసంగంలో కార్యకర్తలు చేసిన కామెంట్లకు సపోర్టుగా త్రిషను డబుల్ మీనింగ్ డైలాగ్లతో ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఇప్పుడు త్రిష ఇలాంటి పోస్ట్ పెట్టింది. ఇక ఈమె పెట్టిన పోస్ట్ ను బట్టి చూస్తే ఉదయనిధిని ఉద్దేశించి త్రిష ఈ కామెంట్ పెట్టిందా అనే అనుమానాలు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా త్రిష ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం ఇటీవల త్రిషను టార్గెట్గా చేసి కామెంట్లు చేసిన వారందరి పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారు.
