చిల్లర కామెంట్లకు త్రిష కౌంటర్.. ఇచ్చిపడేసిందిగా!
తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న సమయంలో స్టార్ హీరో విజయ్ తో త్రిష కలిసి ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కు ఇటీవల హాజరయ్యారు.
By: M Prashanth | 9 March 2026 10:24 AM ISTసీనియర్ బ్యూటీ త్రిష చేసిన లేటెస్ట్ ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన పోస్ట్ లో త్రిష.. ఎక్కడా ఎవరు ప్రస్తావించకపోయినా రీసెంట్ గా ఆమెపై చిల్లర కామెంట్లు చేసిన డైరెక్టర్ కమ్ యాక్టర్ పార్తీబన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో త్రిష ఘాటుగా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది.
తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న సమయంలో స్టార్ హీరో విజయ్ తో త్రిష కలిసి ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కు ఇటీవల హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి వీరిద్దరూ ఒకే కారులో రావడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఘటన తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ మరిన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సినీ ప్రియులు, అభిమానులు, నెటిజన్లు ఆ విషయంపై రెస్పాండ్ అవుతున్నారు.
అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఒక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పార్తీబన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో స్క్రీన్ పై త్రిష ఫోటో ప్రదర్శించడంతో ఆమెపై అభిప్రాయం చెప్పమని నిర్వాహకులు కోరారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆమె పోషించిన కుందవై పాత్రను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు.
కుందవై కొంతకాలం ఇంట్లో ఉంటే బాగుంటుందని, బయటికి వస్తే అనవసరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. పార్తీబన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఒక నటిపై అలాంటి కామెంట్స్ చేయడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా విషయం త్రిష దృష్టికి కూడా చేరింది.
దీంతో త్రిష సోషల్ మీడియాలో స్పందించారు. అయితే ఆమె తన ట్వీట్‌లో ఎక్కడా పార్తీబన్ పేరును ప్రస్తావించలేదు. కానీ వ్యాఖ్యలను బట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. "ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో నా పేరు, ఫోటో ప్రదర్శించారు. చివరి నిమిషంలో ఒక వ్యక్తి తన సహాయకుడు ద్వారా కోరడంతో అలా చేశామని నిర్వాహకులు నాకు చెప్పారు. అయితే మైక్ చేతిలో ఉందని మాట్లాడిన ప్రతిదీ తెలివైన వ్యాఖ్యగానీ, కామెడీగానీ మారదు. కొన్నిసార్లు అది మూర్ఖత్వాన్ని మరింత బయట పెడుతుంది" అని పేర్కొన్నారు.
"జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు అవి.. ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయన్న దానికంటే, మాట్లాడిన వ్యక్తి స్వభావాన్ని ఎక్కువగా చూపిస్తాయి" అని త్రిష అన్నారు. విమర్శలు అవి ఎదుర్కొనే వ్యక్తి గురించి కాకుండా వాటిని చేసే వ్యక్తి గురించి ఎక్కువగా చెబుతాయని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. ఇక పార్తీబన్. త్రిష పోస్ట్ పై ఇప్పుడు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.
