Begin typing your search above and press return to search.

లండన్ వీధుల్లో త్రిష స్పెషల్ వాక్!

అయితే సెలబ్రిటీ అయినా సరే పర్సనల్ లైఫ్‌లో ప్రైవసీ అవసరమని అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం సరైంది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   31 Aug 2026 1:00 PM IST
లండన్ వీధుల్లో త్రిష స్పెషల్ వాక్!
X

దక్షిణాది చిత్రపరిశ్రమలో సుదీర్ఘకాలంగా కథానాయకిగా రాణిస్తున్న స్టార్ నటి త్రిష షూటింగ్‌లు .. ప్రమోషనల్ ఈవెంట్ల రద్దీకి దూరంగా ప్రస్తుతం లండన్‌లో స్నేహితులతో కలిసి క్వాలిటీ టైమ్‌ను గడుపుతున్నారు. ఇటీవల లండన్‌లోని చైనాటౌన్ వీధుల్లో సాధారణ దుస్తుల్లో స్నేహితులతో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న త్రిషను ఒక అభిమాని గుర్తించి వీడియో తీశారు. అయితే సెలబ్రిటీ అయినా సరే పర్సనల్ లైఫ్‌లో ప్రైవసీ అవసరమని అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం సరైంది కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పర్యటనలో త్రిష ఎంతో సాధారణంగా బ్లూ జీన్స్ ... బ్లాక్ జంపర్ ధరించి లండన్ వీధుల్లో హాయిగా సంచరిస్తూ కనిపించారు. `మా లండన్ వాకింగ్ ఇలా ఒక సెలబ్రిటీ స్పాటింగ్‌గా మారుతుందని అస్సలు ఊహించలేదు` అంటూ సదరు అభిమాని ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కెమెరా కంటికి చిక్కిన త్రిష లుక్స్ అభిమానులను ఆక‌ట్టుకుంటున్నా? ఆ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్ చేసిన విధానంపై మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.

త్రిష వ్యక్తిగత సమయానికి భంగం కలిగిస్తూ వీడియోను రికార్డ్ చేయడంపై ఎక్కువ మంది నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. `ఆమె తన స్నేహితులతో కలిసి ప్రైవేట్ టైమ్‌ను గడుపుతున్నప్పుడు వీడియోలు తీయడం ఏమిటి? సెలబ్రిటీలకంటూ కాస్త ప్రైవసీ ఇవ్వడం నేర్చుకోండి` అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశారు. ఉపాధి, వినోదం పక్కన పెడితే ప్రతి చిన్న విషయాన్ని కెమెరాలో బంధించి నెట్‌లో పెట్టే ధోరణి సరైంది కాదని మరికొందరు హితవు పలికుతున్నారు.

సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛ , పబ్లిక్ లైఫ్ మధ్య ఉండాల్సిన సరిహద్దులపై ఈ ఘటన మరొకసారి గట్టి చర్చను రేకెత్తించింది. స్టార్ హోదా ఉన్నంత మాత్రాన వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రతి క్షణం రికార్డ్ చేయడం ప్రైవసీ ఉల్లంఘన కిందకే వస్తుందని సినీ ప్రియులు స్పష్టం చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నా? వారి ప్రైవేట్ క్షణాలను గౌరవించాల్సిన బాధ్యత అభిమానులపై ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు లండన్ పర్యటన వీడియో బయటకు రావడంతో త్రిష వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీలో , పబ్లిక్ ఈవెంట్లలో ఆమె కనిపించే తీరుపై నెటిజన్లు నిరంతరం దృష్టి సారిస్తుండటంతో, చిన్నపాటి వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. అయితే ప్రచారానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునే తారలకు ఇలాంటి ఘటనలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయన్న‌ది అంతే వాస్త‌వం. ఎంతటి స్టార్ డమ్ ఉన్న నటీనటులైనా కెమెరా వెలుగులకు దూరంగా ప్రైవేట్ లైఫ్‌ను కోరుకోవడం సహజం. లండన్ వీధుల్లో త్రిష ఎదుర్కొన్న సంఘటన, డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ప్రైవసీకి దక్కుతున్న విలువ ఎంత? అనే ప్రశ్నకు నిదర్శనంగా నిలుస్తోంది.