త్రిష.. మళ్లీ కొత్త చర్చేంటి?
విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో త్రిష చేరబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి.
By: M Prashanth | 10 Jun 2026 1:15 PM ISTసీనియర్ బ్యూటీ త్రిష పేరు మరోసారి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. విజయ్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారం, ఇటీవల ఇద్దరూ కొన్ని సందర్భాల్లో కలిసి కనిపించడం వంటి పరిణామాలు ఆ చర్చలు మరింత పెంచాయి.
విజయ్ కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో త్రిష చేరబోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ తన తిరుచ్చి అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ జరిగే ఉప ఎన్నికలో త్రిష బరిలోకి దిగుతారనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే దీనిపై పార్టీ నాయకుల నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. చివరికి ఆ ప్రచారం నిజం కాలేదు.
ఇక త్రిష ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడంపైనే ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇప్పట్లో ఉండదనే వార్తలు వచ్చాయి. అయినప్పటికీ సరైన సమయంలో ఆమె రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మొత్తం వ్యవహారానికి మరో కారణం కూడా ఉంది.
2004లో ఓసారి త్రిష సరదాగా మాట్లాడుతూ "నాకు తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఉంది.. మరో పదేళ్లు ఆగండి" అంటూ అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో అదరగొట్టిన వేళ.. ఆ పాట వీడియోను నెటిజన్లు మళ్లీ వైరల్ చేయడంతో పొలిటికల్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అలాగే విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి త్రిష హాజరు కావడం కూడా చర్చనీయాంశమైంది. దీని పొలిటికల్ సిగ్నల్ గా కొందరు భావిస్తే, మరికొందరు మాత్రం ఫ్రెండ్లీ అటెండెన్స్ గా చూస్తున్నారు. మరోవైపు విజయ్ రిజైన్ చేసిన స్థానంలో త్రిష పోటీ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ, ఆ స్థానానికి రాఘవ లారెన్స్ పేరు వినిపించడం కొత్త ట్విస్ట్ గా మారింది.
అయితే ఆ ఊహాగానాలన్నింటికీ త్రిష ఇటీవల తన న్యాయవాది ద్వారా విడుదల చేసిన లీగల్ స్టేట్మెంట్ తో చెక్ పెట్టేందుకు కూడా ప్రయత్నించారు. తనను ఏ రాజకీయ పార్టీతోనూ లింక్ పెట్టవద్దని, తాను కేవలం నటిగా మాత్రమే గుర్తింపు పొందాలని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పబ్లిక్ చర్చగా మార్చడం సరికాదని పేర్కొన్నారు.
అంతేకాదు, తన పేరును రాజకీయ వివాదాల్లోకి లాగుతూ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజకీయాలకు దూరంగా కొనసాగుతున్నానని త్రిష స్పష్టం చేశారు. ఏదేమైనా త్రిష పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. పాత వీడియోలు, సోషల్ మీడియా ప్రచారం, విజయ్ తో రిలేషన్ వంటి అంశాలే ఆ రూమర్లకు కారణమయ్యాయి. అదే సమయంలో లాయర్ ద్వారా త్రిష క్లారిటీ ఇచ్చినా.. ఇప్పుడు మళ్లీ కొత్త చర్చేంటి అంటూ కొందరు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
