Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మలకు మెగా లక్ ఉంటుందా..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు కూడా ఒకేసారి మన మెగాస్టార్ చిరంజీవితో జత కడుతున్నారు.

By:  Ramesh Boddu   |   6 Oct 2025 10:09 AM IST
ముద్దుగుమ్మలకు మెగా లక్ ఉంటుందా..?
X

కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఇద్దరు కూడా ఒకేసారి మన మెగాస్టార్ చిరంజీవితో జత కడుతున్నారు. తమిళ్ లో స్టార్ ఫాం కొనసాగిస్తున్న నయనతార చిరంజీవితో మన శంకర వరప్రసాద్ తో వస్తుంటే.. త్రిష మెగాస్టార్ విశ్వంభర సినిమాలో ఛాన్స్ అందుకుంది. అసలైతే విశ్వంభర సినిమానే ముందు రిలీజ్ అవ్వాల్సింది కానీ ఆ సినిమాకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఎక్కువ ఉన్నందు వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా 2026 సమ్మర్ కి విశ్వంభర రిలీజ్ లాక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి 156, 157 సినిమాలుగా ఇవి వస్తున్నాయి.

విశ్వంభర హిట్ పడితే మరికొన్ని ఆఫర్లు..

ఐతే ఈ రెండు సినిమాలతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మల టాలీవుడ్ కెరీర్ ఆధారపడి ఉంది. అలా ఎందుకంటే త్రిష వరుస తమిళ సినిమాలు చేస్తూ అక్కడ బిజీ బిజీ అయ్యింది. ఈమధ్య అక్కడ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో తెలుగు ఆఫర్ ని ఓకే చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత త్రిష తెలుగు సినిమా చేస్తుంది. అందుకే విశ్వంభర హిట్ పడితే మరికొన్ని ఆఫర్లు వస్తాయన్న హోప్ తో ఉంది అమ్మడు. వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంభర సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సినిమా త్రిషకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

మరోపక్క మన శంకర వరప్రసాద్ తో నయనతార వస్తుంది. ఈ సినిమా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి ఇది రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమాతో ఆఫ్టర్ గ్యాప్ నయనతార తెలుగు సినిమా చేస్తుంది. ఆమధ్య స్టార్స్ తో నయన్ వరుస తెలుగు సినిమాలు చేసినా కూడా ఆ తర్వాత కోలీవుడ్ లో బిజీ అయ్యి ఇక్కడ ఆఫర్లు వచ్చినా కాదన్నది. ఇప్పుడు అమ్మడు మెగా మూవీతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకుంటుంది. అనిల్ రావిపూడి సినిమా కాబట్టి అది కూడా సంక్రాంతికి వస్తుంది. సో కచ్చితంగా శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ టార్గెట్ ఫిక్స్ అయినట్టే.

త్రిష, నయనతార గ్యాప్ తర్వాత..

ఐతే త్రిష, నయనతార చాలా కాలం గ్యాప్ తర్వాత ఇద్దరు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇవ్వడం సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమాల ఫలితాలు వారి టాలీవుడ్ కెరీర్ కి హెల్ప్ అయ్యేలా ఉంటాయని చెప్పొచ్చు. త్రిష విశ్వంభర తో పాటు సూర్య కరుప్పు సినిమాలో నటిస్తుంది. నయనతార మాత్రం తమిళ్ లో మూకుత్తి అమ్మన్ 2, హాయ్, రక్కియే సినిమాలు చేస్తుంది. మలయాళంలో ఒక సినిమా చేస్తుంది అమ్మడు.