త్రిషకు కుర్రాడు దొరికేసాడా?
మనసుకు నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని...పెళ్లి విషయంలో తానెంతో పాజిటివ్ గా ఉన్నట్లు తెలిపింది.
By: Srikanth Kontham | 8 Oct 2025 7:00 PM ISTఅందాల త్రిష ఇంట పెళ్లి భాజాలకు సమయం ఆసన్నమైందా? తల్లిదండ్రులు చూసిన సంబంధానికి అమ్మడు ఒకే చెప్పిందా? అంటే అవుననే ఓ వార్త ప్రచారంలోకి వస్తోంది. త్రిషకు బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్ తో నిశ్చితార్దం జరగడం.. అటుపై వీగిపోవడం తెలిసిందే. ఇద్దరు ప్రేమవివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ అది నిశ్చితార్దం వరకే పరిమితమైంది. ఆ సంఘటన తర్వాత త్రిష మళ్లీ పెళ్లి అనే ఆలోచన లేకుండా సినిమాల్లో బిజీ అయింది. ఈ నేపథ్యంలో త్రిష పెళ్లి చేసుకోదా? అన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రేమలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో మరో ప్రేమ వివాహం చేసుకోదా? అన్న ప్రచారాన్ని ఖండించింది.
మనసుకు నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి చేసుకుంటానని...పెళ్లి విషయంలో తానెంతో పాజిటివ్ గా ఉన్నట్లు తెలిపింది. కానీ ఆ గడియలు ఇంకా రాలేదని త్రిష సింగిల్ లైఫ్ తో అర్దమైంది. అటు ఎవరితోనూ ప్రేమలో పడినట్లు ఎలాంటి ప్రచారం కూడా తెరపైకి రాలేదు. సినిమాలు...ఇల్లు తప్ప మరో ప్రపంచంతో సంబంధం లేనట్లే జీవినం సాగిస్తోంది. అయితే తాజాగా త్రిష తల్లిదండ్రులు చూసిన సంబంధానికి ఒకే చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. చండీఘర్ కు చెందిన అబ్బాయితో సంబంధం కుదుర్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
అతడు ఆస్ట్రేలియాలో బిజినెస్ మ్యాన్ అని ఈ మధ్యనే అక్కడ జరిగే వ్యాపారాన్ని స్వదేశంలో కొత్తగా విస్తరించినట్లు వార్తలొస్తున్నాయి. త్రిష తల్లిదండ్రులకు బాగా తెలిసిన కుటుంబ.. కుర్రాడని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. ప్రస్తుతం త్రిష నటిగా బిజీ అవుతోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తోన్న `విశ్వంభర`లో నటిస్తోంది. తమిళ్ లో `కరుప్పు`లోనూ నటిస్తోంది. చేతిలో ఉన్నవి ఈ రెండు సినిమాలే. మునపటి కంటే అవకాశాలు తగ్గడంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కోసం ప్రయత్నిస్తోంది.
ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే అమ్మడు మళ్లీ బిజీ అవుతుంది. నటిగా ఇప్పటికే సౌత్ లో అన్ని భాషల్ని టచ్ చేసింది. తెలుగు, తమిళ్ లో ఫేమస్ హీరోయిన్ గా వెలిగింది. బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ క్లిక్ అవ్వలేదు. ఒక్క సినిమాతోనే అక్కడ నుంచి నిష్క్రమించింది. అయితే తాజాగా మళ్లీ హిందీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
