Begin typing your search above and press return to search.

ప్రేమ లేకపోతే దేనికీ అర్థం ఉండదు.. త్రిషలో నిగూఢ‌మైన మరో మ‌నిషి!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా దశాబ్దాలుగా రాణిస్తున్న త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితంపై పుకార్ల గురించి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   6 April 2026 10:17 AM IST
ప్రేమ లేకపోతే దేనికీ అర్థం ఉండదు.. త్రిషలో నిగూఢ‌మైన మరో మ‌నిషి!
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా దశాబ్దాలుగా రాణిస్తున్న త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితంపై పుకార్ల గురించి తెలిసిందే. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో త్రిష‌ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై నేరుగా స్పందించని త్రిష తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తున్న నిగూఢమైన పోస్టులు ఇటీవ‌ల‌ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు కూడా అలాంటి మ‌రో పోస్ట్ వాడి వేడి చ‌ర్చ‌కు తెర తీసింది.





``ప్రతిదీ ప్రేమ కాదు.. కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం ఉండదు`` అనే కోట్‌ను షేర్ చేసిన త్రిష దానికి `నిజం` అనే ట్యాగ్ ని ఇచ్చారు. దీనిని చూడ‌గానే ఇది త్రిష‌లో నిగూఢంగా దాగి ఉన్న మ‌రో మ‌నిషి అప్ర‌య‌త్నంగా చేసిన పోస్ట్ అంటూ అభిమానులు ఊహిస్తున్నారు.

అయితే త్రిష‌- విజ‌య్ జంట క‌లిసి నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించారు. కోలీవుడ్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ జంట చాలా గ్యాప్ త‌ర్వాత `లియో` అనే చిత్రంలోను క‌లిసి న‌టించారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. విజయ్ పుట్టినరోజు సందర్భంగా త్రిష అత‌డితో దిగిన ఒక ప్ర‌త్యేక‌మైన‌ ఫోటోను షేర్ చేయడం.. ఇద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని నెటిజన్లు ఆరోపించడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. తాజాగా త్రిష చేసిన పోస్టు.. త‌న‌ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టే ప్ర‌య‌త్న‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

త్రిష తన పోస్టుల్లో కేవలం ప్రేమ గురించి ప్ర‌స్థావిస్తూ ప్ర‌శాంత‌త‌ను కోరుకుంటున్న‌ట్టు ఎదుటివారికి హింట్ ఇచ్చారు. గందరగోళం కంటే మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంత ముఖ్యమో చెప్ప‌క‌నే చెప్పారు. త్రిష‌ వ్యాఖ్యలు ప్రస్తుతం త‌ను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ప్రతిబింబిస్తోంద‌ని అభిమానులు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. త్రిష ఇన్ స్టాలో చాలా నిగూఢ సందేశాలున్నాయి. ఈ నిగూఢమైన సందేశాల వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో తెలియక అభిమానులు కొంత క‌న్ఫ్యూజ్ అవుతున్నా..వాటిలో త‌న‌ను బాధిస్తున్న వారికి వివ‌ర‌ణ ఇస్తున్నార‌ని కూడా భావిస్తున్నారు.

మరోవైపు విజయ్ తన రాజకీయ ప్రవేశం, వ్యక్తిగత జీవిత మార్పుల గురించి చర్చ జరుగుతున్న క్లిష్ట సమయంలో ఇటువంటి పుకార్లు రావడం అత‌డి అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉంటే త్రిష తన సినిమా కెరీర్‌లో బిజీగా గడుపుతోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన `విశ్వంభర` వంటి భారీ చిత్రంలో నటిస్తూనే.. కోలీవుడ్ అగ్ర హీరో సూర్యతో కలిసి `వీరభద్రుడు` చిత్రీక‌ర‌ణ‌ను త్రిష పూర్తి చేసారు. `వీర‌భ‌ద్రుడు` మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంతో బిజీగా ఉంటూనే.. పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న వార్తలను ఈ సీనియ‌ర్ న‌టీమ‌ణి తనదైన శైలిలో డీల్ చేస్తోంది.

సెలబ్రిటీల జీవితం అంటేనే పుకార్లకు కేరాఫ్ అడ్రస్ అని తెలిసినా.. త్రిష వంటి సీనియర్ నటి ప్రశాంతత కోసం పడుతున్న తపన త‌న‌ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పుకార్లకు చెక్ పడాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు నేరుగా స్పందించాల్సిన అవసరం ఉందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు త్రిష చేసే ఇటువంటి క్రిప్టిక్ పోస్టులు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తూనే ఉంటాయి.