'ప్రేమకు థ్యాంక్స్'.. త్రిషను చూసి ఫిదా అవ్వాల్సిందేనా?
తాజాగా ఆమె చీరకట్టులో దిగిన ఫోటోలు షేర్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
By: M Prashanth | 7 March 2026 12:00 AM ISTసౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న త్రిష.. ఇప్పటికీ అదే గ్లామర్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా త్రిష ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తరచూ తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ట్రెండింగ్ లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె చీరకట్టులో దిగిన ఫోటోలు షేర్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. క్రీమ్ కలర్ పట్టుచీరలో త్రిష కనిపించిన ఆ ఫోటోలు అభిమానులను, సినీ ప్రియులను ఫిదా చేస్తున్నాయి.
ఆ ఫిక్స్ ను షేర్ చేస్తూ "ఎల్లప్పుడూ నా అభిమానులుగా ఉండి నాకు ప్రేమ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. త్రిష ధరించిన క్రీమ్ కలర్ పట్టుచీరకు గ్రీన్ కలర్ స్టోన్స్ తో ఉన్న నెక్ సెట్ మరింత అందం తీసుకొచ్చింది. ఏదేమైనా సింపుల్ మేకప్, చిన్నపాటి చిరునవ్వుతో త్రిష మెరిసిపోయారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
అయితే త్రిష ఆ ఫోటోలు దిగిన సందర్భం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ తమిళ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సురేష్ తనయుడి వివాహ రిసెప్షన్ గురువారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆ వేడుకకు త్రిష హాజరవ్వగా.. రిసెప్షన్ కు వెళ్లే ముందు రెడీ అయిన సమయంలో తీసుకున్న ఫోటోలనే ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.
అదే వేడుకకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఆ ఫంక్షన్ కు త్రిష, ప్రముఖ నటుడు విజయ్ తో కలిసి ఒకే కారులో వెళ్లారని కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, నెటిజన్లు మాత్రం డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో త్రిష షేర్ చేసిన ఫోటోలు మరింత హాట్ టాపిక్ గా మారాయి.
కాగా.. చీరలో త్రిష కనిపించిన ప్రతీసారి ఆమె ప్రత్యేకమైన స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పట్టుచీరలోనైనా, కాటన్ చీరలోనైనా, లైట్ కలర్ డిజైనర్ చీరల్లోనైనా తనదైన అందంతో మెరిసిపోతారు. సాధారణ అవుట్ ఫిట్సే అయినా త్రిషకు బాగా సెట్ అవుతాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతున్న త్రిష, ఇప్పటికీ అదే క్రేజ్ తో ప్రేక్షకులను అలరిస్తుండటం ఆమె స్పెషలిటీగా చెప్పుకోవాలి.
