Begin typing your search above and press return to search.

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

త్రిష తన తాజా చీరకట్టు ఫోటోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. చెన్నైలో జరిగిన వైఎస్ జార్జి రెడ్డి మనవరాలు శ్రేయ వివాహ వేడుకకు హాజరైన ఆమె.. లేత గులాబీ రంగు నెట్ చీర, ఎంబ్రాయిడరీ బ్లౌజ్, సిల్వర్ చోకర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకకు విజయ్, కేటీఆర్, జగన్ కూడా హాజరయ్యారు. తాజాగా ఈ ఫోటోలను త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   7 Nov 2026 12:17 PM IST
43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!
X

అందానికి అందం.. అద్భుతమైన అభినయంతో 43 ఏళ్ల వయసులో కూడా తరగతి అందంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో త్రిష కృన్ ష్ణ కూడా ఒకరు. తమిళ్, తెలుగు చిత్రాలలో నటిస్తూ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈమె.. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలకు పైగానే అవుతున్నా వరుసగా అవకాశాలు అందుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.





ఈ క్రమంలోనే తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్న ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ జార్జి రెడ్డి కుమారుడు అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం ఉజ్వల్ తో జరిగింది. గురువారం సాయంత్రం చెన్నైలోనే ఒక హోటల్లో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.





ఇందులో తమిళనాడు సీఎం విజయ్ తో పాటు త్రిష ,కేటీఆర్, జగన్ వంటి వారు సందడి చేశారు. ఈవెంట్లో త్రిష తన అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. పైగా ఈ వేడుకకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫోటోలను తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈమె అందం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.





లేత గులాబీ రంగు నెట్ చీర కట్టుకుంది త్రిష. దీనిపై ముత్యాలు , సీక్వెన్స్, గ్లాస్ బీడ్స్ అలాగే క్రిస్టల్స్ తో దీనిని చాలా గ్రాండ్ గా చేతితో ఎంబ్రాయిడరీ వర్క్ పూర్తి చేశారు. బ్లౌజ్ విషయానికి వస్తే.. చీరకు మ్యాచ్ అయ్యేలా ఫుల్ స్లీవ్స్ ఎంబ్రాయిడరీ బ్లౌజును ధరించింది. బ్లౌజ్ చేతుల చివరన ఇచ్చిన ఫెదర్ డీటెయిల్ ఈ లుక్కును ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. పైగా ఈ క్లాసీ సారి సెట్ ను హెవీ అండ్ క్లాసిక్ సిల్వర్ చౌకర్ నెక్లెస్ తో ఫుల్ ఫిల్ చేసింది. పైగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఈమె అందాన్ని రెట్టింపు చేశాయి. మొత్తానికి అయితే తన లేటెస్ట్ చీరకట్టుతో అభిమానులను మెస్మరైజ్ చేసింది త్రిష.. పైగా ఈ ఫోటోలకు క్యాప్షన్ గా తక్కువ మాట్లాడడమే మంచిది అన్నట్టుగా ఇచ్చిన క్యాప్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె అందానికి అభిమానులు ఫిదా అవుతూ కవిత్వాలు వల్లిస్తున్నారు.