మహిళలు మొండిపట్టు.. భర్తలకు తలనొప్పిగా మారిన త్రిష అవుట్ ఫిట్..
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష మెరిసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
By: Madhu Reddy | 12 May 2026 4:00 PM ISTదక్షిణాది వెండితెర రాణి త్రిష కృష్ణన్ ఏం చేసినా ఒక ట్రెండ్ సెట్టే. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో త్రిష మెరిసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె కట్టుకున్న నీలి రంగు పట్టుచీర, ఆ డిజైనర్ బ్లౌజ్ కోసం ఇప్పుడు మహిళలంతా షాపింగ్ మాల్స్, బోటిక్స్‌కు క్యూ కడుతున్నారు. త్రిష అందం, ఆమె స్టైల్ వెనుక ఉన్న ఆ క్రేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆకట్టుకున్న 'అక్వా బ్లూ' పట్టుచీర:
చెన్నైలో జరిగిన విజయ్ ప్రమాణస్వీకారం ఈవెంట్‌లో త్రిష ధరించిన టర్కోయిస్-బ్లూ కంచి పట్టుచీర అందరి కళ్లను తిప్పుకోనివ్వలేదు. బంగారు రంగు జరీ బోర్డర్, క్లాసిక్ డిజైన్‌తో ఉన్న ఆ చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించింది.ఇక దీనికి తోడు క్రీమ్ కలర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా మార్చేసింది. ఇప్పుడు సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అలాంటి చీర కోసమే వెతుకుతున్నారు.

బోటిక్స్‌లో త్రిష బ్లౌజ్ హంగామా:
చీర ఎలాగోలా దొరుకుతుంది కానీ, ఆ బ్లౌజ్ డిజైన్ దొరకడమే కష్టమని లేడీస్ ఫీలవుతున్నారు. అందుకే త్రిష ఫోటోలను టైలర్లకు, బోటిక్ యజమానులకు చూపిస్తూ "నాకు సేమ్ ఇలాంటి వర్క్ కావాలి" అని ఆర్డర్లు ఇస్తున్నారు. ఇప్పుడు దీంతో సిటీలోని ఫేమస్ బోటిక్స్,టైలర్ షాప్స్ అన్నీ త్రిష స్టైల్ బ్లౌజ్ డిజైన్లతో కళకళలాడుతున్నాయి. ఇక 'నైరమ్ స్టూడియో' డిజైన్ చేసిన ఆ బ్లౌజ్ ఇప్పుడు ఒక హాట్ ట్రెండ్ అయిపోయింది.

మెరిసిన డైమండ్ జువెలరీ:
కేవలం బట్టలు మాత్రమే కాదు, త్రిష ధరించిన ఆభరణాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ జువెలర్స్ నుంచి వచ్చిన డైమండ్ చోకర్, అందులో మెరుస్తున్న కెంపు రాయి ఆమె ముఖానికి మరింత నిండుదనాన్ని ఇచ్చింది. తలలో మల్లెపూలు పెట్టుకుని పక్కా సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఆమె సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేస్తూ "ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వినిపిస్తుంది" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

రెండు దశాబ్దాల క్రేజ్.. తగ్గని జోరు:
1999లో మిస్ చెన్నైగా ప్రయాణం మొదలుపెట్టిన త్రిష, ఇప్పటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతుండటం విశేషం. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా నుంచి మొన్నటి పొన్నియిన్ సెల్వన్, లియో వరకు ఆమె మేజిక్ అలాగే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', సూర్యతో 'కరుపు' వంటి భారీ ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లోనే కాదు, ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఆమె 'క్వీన్' అని మరోసారి రుజువైంది.
స్టైల్ అంటే కేవలం ఆధునిక దుస్తులు ధరించడం మాత్రమే కాదు, సాంప్రదాయ పట్టుచీరలో కూడా ఎంత అందంగా ఉండవచ్చో త్రిష నిరూపించింది. అందుకే ఆమెను అభిమానులు 'ఎవర్ గ్రీన్ బ్యూటీ' అని పిలుచుకుంటారు.
