అక్కడ రీ లాంచ్ కోసం ట్రై చేస్తోందా?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల త్రిష అగ్ర తారగా కొనసాగింది. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని నాయికగా ఎదిగింది.
By: Srikanth Kontham | 22 Sept 2025 8:57 AM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల త్రిష అగ్ర తారగా కొనసాగింది. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని నాయికగా ఎదిగింది. దాదాపు ఆ రెండు భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్ని మలయాళ, కన్నడ చిత్రాల్లోనే మెరిసింది. కానీ బాలీవుడ్ లో మాత్రం అమ్మడు ఫెయిలైంది. అక్కడ ఒక్క సినిమాతోనే కెరీర్ ని ముగించాల్సి వచ్చింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం `కట్టామిట్టా` చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అదే తొలి సినిమా..చివరి సినిమాగా చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్లీ మరో హిందీ సినిమాలో నటించలేదు. తాను కూడా అక్కడ పరిశ్రమను ఆ సమయంలో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.
బాలీవుడ్ కి టచ్ లోనా:
తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉండటంతో బాలీవుడ్ ని లైట్ తీసుకుంది. అలా హిందీ పరిశ్రమలో తన ముద్ర వేయలేకపోయింది. కానీ అక్కడా రాణించాలనే కోరిక మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు మరోసారి బాలీవుడ్ లో రీ-లాంచ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. కొన్ని రోజులుగా చెన్నై టూ ముంబై ప్లైట్ జర్నీలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ మీడియా సంస్థతో రెగ్యుల ర్ గా టచ్ లో ఉంటుందిట. అలాగే పాత పరిచయాలు, స్నేహితులకు టచ్ లోకి వెళ్లినట్లు వార్తలొస్తున్నాయి.
మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.
టైర్ 2 హీరోలకు నో ఛాన్స్:
ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్నది రెండు సినిమాలే. చిరంజీవి హీరోగా నటిస్తోన్న `విశ్వంభర`లో నటిస్తోంది. కోలీవుడ్ లో `కరుప్పు`లో నటిస్తోంది. ఇవి తప్ప కొత్త సినిమాలు వేటికి కమిట్ అవ్వలేదు. అయితే ఈ రెండు భాషల్లోనూ అవకాశాలు వస్తున్నా? మంచి పారితోషికం ఆఫర్ చేస్తున్నా త్రిష మాత్రం కమిట్ అవ్వడం లేదు. సెలక్టివ్ గా వెళ్తోం ది. కథ, పాత్రలు నచ్చితే తప్ప సైన్ చేయడం లేదు. మీడియం రేంజ్, టైర్ 2 హీరోలతో మంచి అవకాశాలు వచ్చినా అంగీకరించడం లేదు. కేవలం స్టార్ హీరోలతో ఛాన్సులొస్తేనే పరిశీలిస్తుంది.
విజయం అనివార్యమే:
ఇదే ఏడాది ఇప్పటికే మూడు రిలీజ్ లతో ప్రేక్షకుల మధ్యలోకి వచ్చింది. `విదాముయార్చీ`, `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో అజిత్ కు జోడీగా నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ రిలీజ్ `తగ్ లైఫ్` లో కమల్ హాసన్ కి జోడీగా నటించింది. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. దీంతో సక్సెస్ కూడా అనివార్యమైన సమయం ఇది. అందుకు రెడీగా ఉన్న చిత్రం `విశ్వంభర` మాత్రమే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం కారణంగా ఆలస్యమవుతోంది. ఈ సినిమా హిట్ తోనైనా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.
