త్రిష.. అప్పుడు కావాలి, ఇప్పుడు వద్దు!
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గత కొన్ని వారాలుగా మీడియాలో పతాక స్థాయి శీర్షికలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 12 Jun 2026 11:00 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గత కొన్ని వారాలుగా మీడియాలో పతాక స్థాయి శీర్షికలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. తమిళనాట అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఆమె గురించి చర్చ మొదలైంది. విజయ్‌తో ఆమె ప్రేమాయణం అంటూ ఒక బీజేపీ నాయకుడు ఏకంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అనుకున్నారు. మరో వైపు విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వడం వల్ల ఆ వార్తలకు బలం చేకూర్చినట్లు అయింది. విజయ్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే త్రిష ఆయన ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలియజేయడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనూ త్రిష ముందు వరుసలో కూర్చుని మురిసి పోయిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఇద్దరి మధ్య బంధం నిజం అని కన్ఫర్మ్ అయ్యింది.
త్రిష కరుప్పు సినిమా...
విజయ్‌కి సన్నిహితంగా కొనసాగుతూనే త్రిష హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. విజయ్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత త్రిష నటించిన కరుప్పు సినిమా వచ్చింది. ఆ సినిమాను ఎక్కువ శాతం మంది త్రిష కోసం చూశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కరుప్పు సినిమా కోసం త్రిష భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంది. విజయ్ ప్రియురాలిగా త్రిషను ఇప్పటికే అంతా కన్ఫర్మ్ చేశారు. వారి ప్రవర్తన, వారు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కనుక త్రిషను తమ సినిమాల్లోకి తీసుకోవాలి అనుకున్న వారు కూడా ఇప్పుడు ఆలోచనల్లో పడ్డట్లుగా తమిళ సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు త్రిషకు ఇప్పుడు డబుల్ క్రేజ్ ఉంది, ఆమె సినిమాలకు గతంతో పోల్చితే డబుల్ బిజినెస్ జరుగుతుంది. కనుక పారితోషికం కూడా పెంచినట్లు సమాచారం అందుతోంది.
విజయ్, త్రిష ప్రేమలో...
ఇంతకు ముందు వరకు త్రిష అయిదు నుంచి ఆరు కోట్ల రూపాయల పారితోషికం తీసుకునేది. కానీ ఇప్పుడు కొత్తగా సినిమాకు కమిట్ కావాలంటే ఏకంగా రూ.15 కోట్లు ఇవ్వాల్సిందే అని త్రిష డిమాండ్ చేస్తుందట. గత నెలలో ఒక ప్రముఖ తమిళ నిర్మాత త్రిషతో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసేందుకు గాను చర్చలు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకు గాను త్రిష భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసిందనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమ చేతిలో ఉంది కనుక అన్ని రకాలుగా త్రిష సహాయం చేస్తుందని, అందుకు కలిపి కూడా పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. త్రిష తో సినిమాలకు పెద్ద హీరోలు కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. కానీ లేడీ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకు త్రిష బెస్ట్ ఎంపిక అనేది ఇప్పటికీ చాలా మంది అనుకుంటున్నారు.
చిరంజీవి విశ్వంభర సినిమాలో...
కొన్నాళ్ల క్రితం వరకు చాలా మంది కోలీవుడ్ హీరోలు, ఇతర భాషల హీరోలు త్రిష హీరోయిన్‌గా నటిస్తే బాగుంటుందని, తమ సినిమాలకు వెయిట్ పెరుగుతుందని భావించారు. కానీ ఇప్పుడు వారే తమ సినిమాల్లో త్రిష హీరోయిన్‌గా నటిస్తే ఆమె డామినేషన్ ఎక్కువ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఇప్పటికే ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని భావించిన దర్శక నిర్మాతలు ఒకరు ఇద్దరు తమ ఆలోచన విరమించుకున్నట్లుగా కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్‌లో ఆమె నటించిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలకు రెడీ అవుతోంది. విశ్వంభర సినిమాకు గాను త్రిష ఆ సమయంలో మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల పారితోషికం తీసుకుని ఉంటుందని సమాచారం. ఇప్పుడ ఆ మొత్తం ఏకంగా రూ.15 కోట్లు కావడంతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఆమె వైపు కూడా చూడక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విజయ్ ప్రియురాలు అనే ట్యాగ్ కారణంగా ఆమెను చాలా మంది హీరోలు పక్కన పెట్టే అవకాశాలు లేకపోలేదు. కనుక ఆమెకు వచ్చే ఆఫర్లు తగ్గడం ఖాయం, అదే సమయంలో ఆమె పారితోషికం భారీ మొత్తంలో పెరిగిన మాట కూడా వాస్తవం అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
