ట్రిప్తి దిమ్రీ ఆరెంజ్ లుక్ కిల్లింగ్
ఆమె తన లుక్స్‌తో నేటి జెన్ జెడ్ యువతను ఆకర్షించంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ట్రిప్తి ఫ్యాషన్ సెన్స్ చాలా సహజంగా ఉండటమే తన ప్రత్యేకత.
By: Sivaji Kontham | 5 Feb 2026 3:00 PM IST'యానిమల్' ఫేం ట్రిప్తి దిమ్రీ తన సోషల్ మీడియా పోస్ట్‌లతో రెగ్యులర్‌గా ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ బో*ల్డ్ బ్యూటీ ఎంచుకునే దుస్తులు, స్టైలింగ్ చాలా మోడ్రన్‌గా, అదే సమయంలో క్లాసీగా ఉంటాయి. ఆమె తన లుక్స్‌తో నేటి జెన్ జెడ్ యువతను ఆకర్షించంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ట్రిప్తి ఫ్యాషన్ సెన్స్ చాలా సహజంగా ఉండటమే తన ప్రత్యేకత.
ట్రిప్తి మరోసారి ఆరెంజ్ లుక్ లో అదరగొట్టింది. నేటి జెన్ జెడ్ లో తనదైన యూనిక్ లుక్ తో దూసుకుపోయే సత్తా ఉందని నిరూపిస్తోంది. ఓవైపు ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూనే, మరోవైపు తనలోని బో*ల్డ్ యాంగిల్ ని ఎలివేట్ చేసేందుకు ట్రిప్తి వెనకాడదు. ఇది నేటితరాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. తాజాగా ఆరెంజ్ లెహంగాలో ట్రిప్తి అందచందాలు సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తున్నాయి.
అయితే ట్రిప్తీకి కెరీర్ పరంగా ఇంత హైప్ ఎందుకు? అంటే, నిజానికి ట్రిప్తి చాలా కాలంగా పరిశ్రమలో ఉన్నారు. లైలా మజ్ను, బుల్బుల్, ఖాలా వంటి సినిమాల్లో తన అద్భుతమైన నటప్రదర్శనతో కట్టి పడేసింది. కానీ అప్పట్లో ఈ బ్యూటీకి రావలసినంత గుర్తింపు రాలేదు. కానీ యానిమల్ తన లైఫ్ గేమ్ ఛేంజర్ గా మారింది. ఈ సినిమాలో జోయా పాత్రతో ట్రిప్తి మెరుపులు మెరిపించింది. ఆ పాత్రలోని బో*నెస్, యూనిక్ ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత నేషనల్ క్రష్ గా యువహృదయాలను కొల్లగొడుతోంది. బ్యాడ్ న్యూజ్ అనే బోల్డ్ చిత్రంలోను ట్రిప్తి టూ గ్లామరస్ పాత్రతో మెప్పించింది.
యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ లో ట్రిప్తి పాత్ర ఉంటుందా? అంటే.. యానిమల్ పార్క్ లో ట్రిప్తి దిమ్రీ పాత్ర కచ్చితంగా ఉంటుందా? అంటే ఇంకా చెప్పలేం. మొదటి భాగం చివరలో ఆమె పాత్ర గురించి ఒక చిన్న సస్పెన్స్ మిగిల్చారు. రణ్‌విజయ్ (రణబీర్ కపూర్)- అజీజ్ మధ్య జరిగే ఘర్షణలో ఆమె పాత్ర ఎంట్రీ ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
సందీప్ వంగా రూపొందిస్తున్న 'స్పిరిట్' చిత్రంలో ట్రిప్తి దిమ్రీ కథానాయికగా ఎంపికవ్వడం బిగ్ జాక్ పాట్ అని చెప్పాలి. ఇది కేవలం గ్లామర్ పాత్రే కాకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రగా ఉంటుందని టాక్. సందీప్ వంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయి.. కాబట్టి మరోసారి ట్రిప్తి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
