హాట్ లేడీకి అమ్మగా సూపర్ బ్యూటీ!
బాలీవుడ్ లో త్రిప్తీ డిమ్రీ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. 'యానిమల్' సక్సెస్ తో తిరుగులేని అవకాశాలు అందుకుంటుంది.
By: Srikanth Kontham | 7 Sept 2025 12:00 AM ISTబాలీవుడ్ లో త్రిప్తీ డిమ్రీ కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. 'యానిమల్' సక్సెస్ తో తిరుగులేని అవకాశాలు అందుకుంటుంది. యానిమల్ అనంతరం బ్యాడ్ న్యూజ్, భూల్ భులయ్య 3 తో రెండు సక్సస్ లు ఖాతాలో పడ్డాయి. దీంతో కొత్త అవకాశాలతో మరింత బిజీ అవుతుంది. ధాకడ్ 2 డివైడ్ టాక్ తెచ్చుకున్నా? ఆ వైఫల్యం అమ్మడిపై పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రస్తుతం రోమియో చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా మాబెహన్ చిత్రంలో కూడా ఛాన్స్ అందుకుంది. ఈ కామెడీ డ్రామాని సురేష్ త్రివేణి తెరకెక్కిస్తున్నారు.
తల్లీతూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రమిది. కూతురు పాత్రకు త్రిప్తీని ఎంపిక చేసారు. మరి తల్లి పాత్రలో ఎవరు? నటిస్తున్నారంటే? ఏకంగా ఎవ్వెర్ గ్రీన్ అందాల నటి మాధురి దీక్షిత్ నే మరోసా రి రంగంలోకి దించుతున్నారు. త్రిప్తీకి మదర్ గా పలువురు సీనియర్ నటీమణులు పేర్లు పరిశీలించి చివరిగా ఆ పాత్రకు మాధురీని ఫైనల్ చేసారు. వీరిద్దరు కలిసి నటించడం తొలిసారి కాదు. భూల్ భులయ్య 3లో కూడా కలిసి నటించారు. అందులో ఆ రెండు పాత్రలకు మంచి పేరొచ్చింది.
ఈ నేపథ్యంలో దర్శకుడు మరోసారి అదే కాంబినేషన్ ని కలిపారు. ప్రేమ, వారసత్వం, వివిధ తరాల మధ్య తరుచూ జరిగే సంఘటనల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నారు. కథలో ప్రధానంగా ఎమోషన్ కి పెద్ద పీట వేస్తున్నారు. మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. రెండు పాత్రలు తల్లి కుమార్తె అయితే? మూడవ పాత్ర ఎవరు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నారు మేకర్స్. ఇందులో శార్దూల్ భరద్వాజ్, రవి కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆ మూడవ పాత్ర వీళ్లిద్దరిలో ఒకటి అవ్వడానికి అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఎమోషన్ కథల్లో ఇంత వరకూ త్రిప్తి కనిపించలేదు. రొమాంటిక్ స్టోరీలు..బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ఫేమస్ అయింది. తాజాగా సినిమాలో ఆ చిత్రాలకు భిన్నమైన పాత్ర పోషించం విశేషం. మరి డాటర్ పాత్రలో త్రిప్తీ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందన్నది చూడాలి. అలాగే త్రిప్తీ డిమ్రీ తెలుగు సినిమా అవకాశాల కోసం సీరియస్ గానే ప్రయత్నిస్తుంది. కానీ తాను అనుకున్న పాత్రలు రాకపోవడంతో కమిట్ అవ్వడం లేదన్నది మరో సమాచారం.
