Begin typing your search above and press return to search.

యానిమల్ బ్యూటీ రూ.14 కోట్ల బంగ్లా వైరల్!

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత బిజీ దశను ఆస్వాదిస్తుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Jun 2026 8:30 AM IST
యానిమల్ బ్యూటీ రూ.14 కోట్ల బంగ్లా వైరల్!
X

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత బిజీ దశను ఆస్వాదిస్తుంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ముంబైలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఒకటైన బాంద్రా వెస్ట్‌లో ఆమె కొనుగోలు చేసిన లగ్జరీ బంగ్లా వివరాలు తాజాగా వైరల్ అవుతున్నాయి.

తాజా రిపోర్ట్స్ ప్రకారం త్రిప్తి డిమ్రీ ఈ ప్రాపర్టీని సుమారు రూ.14 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. కార్టర్ రోడ్ సమీపంలో ఉన్న ఈ గ్రౌండ్ ప్లస్ టూ స్టోరీ బంగ్లా 2,226 చదరపు అడుగుల స్థలంలో నిర్మించబడగా, 2,194 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాను కలిగి ఉంది. బాలీవుడ్‌లో వేగంగా ఎదుగుతున్న నటీమణుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్న త్రిప్తి కెరీర్‌కు ఈ ప్రాపర్టీ కొనుగోలు మరో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

అయితే ఈ ఇంటి ప్రత్యేకత కేవలం దాని ధరలోనే కాదు, దాని డిజైన్‌లో కూడా ఉందని తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లంటే అత్యంత ఆడంబరంగా ఉంటాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, త్రిప్తి ఇంటి ఇంటీరియర్ మాత్రం మినిమలిస్టిక్ కాన్సెప్ట్‌ను ప్రతిబింబిస్తోంది. లైట్ క‌ల‌ర్స్, సాఫ్ట్ డెకర్, ప్రశాంత వాతావరణాన్ని కలిగించే ఫర్నిచర్ ఎంపిక ఈ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా పిస్తా రంగు సోఫా, న్యూట్రల్ టోన్స్‌తో రూపొందించిన లివింగ్ స్పేస్ ఇంటికి హోమ్లీ ఫీల్‌ను తీసుకొచ్చాయి. పెద్ద గ్లాస్ వాల్స్, గ్లాస్ పార్టిషన్లు ఇంటి అంతటా సహజ కాంతి ప్రవహించేలా రూపొందించబడ్డాయి. దీంతో ఇంటి లోపలి భాగం మరింత విశాలంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇంటి లోపలి, బయటి ప్రదేశాల మధ్య సహజ అనుసంధానం ఏర్పడేలా డిజైన్ చేయడం ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.

ఇక ఈ బంగ్లాలోని స్విమ్మింగ్ పూల్ ఏరియా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది. పచ్చదనం మధ్యలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ పూల్ జోన్ విశ్రాంతి కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. గ్లాస్ పార్టిష‌న్స్, నీలం- ఆకుపచ్చ రంగుల సమన్వయం ఆ ప్రదేశానికి మరింత ప్రశాంతతను తీసుకొచ్చాయి. బాల్కనీ ప్రాంతంలో కూడా మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండే వాతావరణాన్ని సృష్టించారు. బెడ్‌రూమ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాడో ల్యాంప్స్ గోడలపై కళాత్మక ఆకృతులను ప్రతిబింబిస్తూ ఆధునిక శైలిని చాటుతున్నాయి. మొత్తంగా త్రిప్తి కొత్త ఇల్లు విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తూనే, సౌకర్యం, ప్రశాంతత, సరళమైన అందాన్ని మేళవించిన నివాసంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, కెరీర్ పరంగా కూడా త్రిప్తి వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ స్పిరిట్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.