పిక్‌టాక్ : 'స్పిరిట్' బ్యూటీ చిల్లింగ్ మూమెంట్స్
ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఒక్క బిగ్ హిట్ లేకపోవడంతో ఇక ఇంతే అనుకుంటున్న సమయంలో ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రికి 'యానిమల్' సినిమాలో వచ్చిన అవకాశం మొత్తం కెరీర్‌ను మార్చేసింది.
By: Ramesh Palla | 1 Aug 2026 10:56 AM ISTఇండస్ట్రీలో అడుగు పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఒక్క బిగ్ హిట్ లేకపోవడంతో ఇక ఇంతే అనుకుంటున్న సమయంలో ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రికి 'యానిమల్' సినిమాలో వచ్చిన అవకాశం మొత్తం కెరీర్‌ను మార్చేసింది. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకున్నా కూడా ఒక్కసారిగా త్రిప్తి బాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఆకట్టుకునే అందంతో పాటు నటనలో మంచి పట్టు ఉన్న కారణంగా త్రిప్తిని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నెత్తిన పెట్టుకున్నారు. యానిమల్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయడం ద్వారా ఒక్కసారిగా త్రిప్తి బిజీ అయింది. వరుసగా రెండు మూడు సినిమాలు నిరాశ పరచినా కూడా ఏమాత్రం త్రిప్తి క్రేజ్ తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం త్రిప్తి ఏకంగా ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో రూపొందుతున్న 'స్పిరిట్' సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో త్రిప్తి...
గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిప్తి ప్రస్తుతం దృష్టి మొత్తం స్పిరిట్‌పై పెట్టినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఖాళీ ఉంటే ట్రిప్స్ కి వెళ్తుందే తప్ప ఏదో ఒక సినిమా చేద్దాం అన్నట్లుగా త్రిప్తి చిన్న చిన్న సినిమాలను కమిట్ కావడం లేదని ఆమె సన్నిహితులు, బాలీవుడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. స్పిరిట్ సినిమా తర్వాత కచ్చితంగా బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల ఇండస్ట్రీల నుంచి తప్పకుండా పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవైపు స్పిరిట్ సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా గడుపుతూ ఉండే ఈ అమ్మడు మరో వైపు సమయం దొరికితే చాలు చిల్ అయ్యేందుకు ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటుందట. తాజాగా మరోసారి ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిల్లింగ్ మూమెంట్స్ ను పోస్ట్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రభాస్‌కు జోడీగా స్పిరిట్ సినిమాలో...
ఐస్ ల్యాండ్ మ్యాజిక్ అంటూ ఈ ఫోటోలను త్రిప్తి షేర్ చేసింది. సింపుల్ అండ్ స్వీట్ లుక్‌లో త్రిప్తి చూడ చక్కగా ఉందంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ త్రిప్తి తీసుకున్న ఈ ఫోటోలు ఆహ్లాదకరంగా ఉన్నాయనే కామెంట్స్ ను చాలా మంది చేస్తున్నారు. ఆకట్టుకునే రూపంతో త్రిప్తి మరోసారి అందరి దృష్టిని ఈ ఫోటో షూట్‌తో ఆకర్షించింది అనడంలో సందేహం లేదు. త్రిప్తి నేచురల్ బ్యూటీ, ఫైర్ బ్రాండ్ అంటూ చాలా మంది ఈమోజీలు షేర్ చేస్తూ తమ అభిప్రాయంను షేర్ చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్స్ మేకప్ లేకుండా ఎక్కువ బయట కనిపించేందుకు ఆసక్తి చూపించరు. కానీ త్రిప్తి రెగ్యులర్‌గా మేకప్ లేకుండా కూడా ఫోటో షూట్స్ ను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆమెను ఫ్యాన్స్ చాలా మంది నేచురల్ బ్యూటీ అంటూ పిలుస్తూ తమ అభిమానం ను కనబర్చుతూ ఉంటారు.
యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా...
ఢిల్లీలోని గర్వాలీ ఫ్యామిలీ జన్మించిన త్రిప్తి డిమ్రి ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి డిగ్రీ పొందింది. మామ్ సినిమాతో 2017లో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా పెద్దగా ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అడపా దడపా ఆఫర్లు వస్తూ కెరీర్‌ను నెట్టుకు వస్తున్న సమయంలో అనుకోని ఆఫర్ అన్నట్లుగా స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. దాంతో ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించడం, ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో చేసిన రొమాంటిక్ సీన్స్‌కు మంచి రీచ్ రావడంతో ఈ అమ్మడు బాలీవుడ్‌తో పాటు అన్ని చోట్ల చర్చనీయాంశంగా మారి హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చాయి. స్పిరిట్ సినిమాలో తీసుకున్న దీపికా పదుకునే తప్పుకోవడంతో త్రిప్తికి లక్కీ ఛాన్స్ దక్కింది. స్పిరిట్‌తో త్రిప్తి కచ్చితంగా టాప్ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాదించడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
