Begin typing your search above and press return to search.

రష్మిక, త్రిప్తిల మధ్య వింత పోలిక వైరల్‌..!

నిర్మాత కర్ణేష్‌ శర్మ తో త్రిప్తి ప్రేమలో పడటం, చాలా తక్కువ సమయంలోనే పెళ్లి వరకు వెళ్లడం, పెళ్లికి ముందు బ్రేకప్‌ కావడం అనేది చకచక జరిగింది.

By:  Ramesh Palla   |   24 Jan 2026 8:00 PM IST
రష్మిక, త్రిప్తిల మధ్య వింత పోలిక వైరల్‌..!
X

యానిమల్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రి. తక్కువ సమయంలోనే పలు సినిమాల్లో నటించిన త్రిప్తి ఇటీవల ఏకంగా ప్రభాస్ స్పిరిట్‌ సినిమాలో చోటు దక్కించుకున్న విషయం తెల్సిందే. ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న త్రిప్తి బిజీ బిజీగా ఉంది. ఒక వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు మరో వైపు వ్యక్తిగత వార్తలతోనూ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తోంది. ఆ మధ్య త్రిప్తి ప్రేమలో ఉందనే వార్తలు జోరుగా వచ్చాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్‌ శర్మ తో త్రిప్తి రిలేషన్‌లో ఉందనే వార్తలు వచ్చాయి. కర్ణేష్‌ నిర్మాణంలో రూపొందిన ఒక సినిమా కోసం త్రిప్తి వర్క్ చేసింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది అనేది బాలీవుడ్‌లో జరిగిన ప్రచారం.

త్రిప్తి, కర్ణేష్‌ శర్మల ప్రేమ వ్యవహారం...

త్రిప్తి, కర్ణేష్‌ శర్మల ప్రేమ విషయం బాలీవుడ్‌లో బాహాటంగానే ప్రచారం జరిగింది. ఇద్దరి మధ్య ప్రేమను పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లికి కూడా రెడీ అవుతున్నారు అనే ప్రచారం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ ఇద్దరూ విడిపోయారు అని వార్తలు రావడం మొదలు అయింది. తక్కువ సమయంలోనే ఇద్దరూ విడిపోయారు. ఆ విషయాన్ని బాలీవుడ్‌ వర్గాల వారు సైతం దృవీకరించారు. వారి నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఇద్దరు విడిపోయిన విషయం వాస్తవం అనేది వారి సన్నిహితులు చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియాలో వీరి ప్రేమ విషయం, బ్రేకప్‌ విషయం ప్రముఖంగా చర్చ జరిగింది. ఈ సమయంలోనే సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి హీరోయిన్‌ రష్మిక మందన్న కు త్రిప్తికి ఈ విషయంలో చాలా దగ్గర పోలిక ఉందంటూ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. నిజమే అన్నట్లుగా చాల మంది ఈ విషయమై చర్చించుకుంటున్నారు.

రష్మిక మందన్న ప్రేమతో పోలిక..

నిర్మాత కర్ణేష్‌ శర్మ తో త్రిప్తి ప్రేమలో పడటం, చాలా తక్కువ సమయంలోనే పెళ్లి వరకు వెళ్లడం, పెళ్లికి ముందు బ్రేకప్‌ కావడం అనేది చకచక జరిగింది. ప్రేమ విషయంను ఇప్పటికీ త్రిప్తి బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపించడం లేదు, అలాగే త్రిప్తి ఎందుకు బ్రేకప్‌ అయ్యారు అనే విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదు. సినిమా ఆఫర్ల కోసం నిర్మాతతో త్రిప్తి సన్నిహితంగా ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో గతంలో రష్మిక మందన్న విషయంలో విమర్శలు వచ్చాయి. రష్మిక కెరీర్‌ ఆరంభంలో నిర్మాత కమ్‌ హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. చాలా తక్కువ సమయంలోనూ వారు కూడా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. రష్మిక, రక్షిత్‌ ల వివాహ నిశ్చితార్థం జరిగింది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే తన నిశ్చితార్థంను రద్దు చేసుకుంది, అంతే కాకుండా రక్షిత్‌ కు బ్రేకప్ చెప్పేసింది అనేది టాక్‌.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం..

రణబీర్‌ కపూర్‌ హీరోగా నటించిన యానిమల్‌ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా త్రిప్తి ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఒకే సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్స్‌ యొక్క ప్రేమ వ్యవహారం ఒకే విధంగా ముగియడం విడ్డూరంగా ఉందని, వారి మొదటి ప్రేమ విషయంలో చాలా పోలికలు ఉన్నాయని, ఇది చాలా విచిత్రంగా ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో రష్మిక మందన్న అభిమానులు మాత్రం ఈ పోలికను తప్పుబడుతున్నారు. ప్రస్తుతం రష్మిక కొత్త జీవితంను మొదలు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ఏమాత్రం కరెక్ట్‌ కాదని వారు అంటున్నారు. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న వివాహం అంటూ చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే వీరి వివాహం జరిపేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.