Begin typing your search above and press return to search.

అందాల భామ‌కు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అత‌డే!

‘స్పిరిట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న తృప్తి డిమ్రి.. తాజాగా దిల్జీత్ దోసాంజ్ కాన్సర్ట్‌లో సందడి చేశారు. బ్లాక్ డిజైనర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఎంత అద్భుతమైన రాత్రి ఇది!’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన నటిస్తున్న ఈ భామ ఫోటోలు వైరల్‌గా మారాయి.

By:  Sivaji Kontham   |   29 Nov 2026 4:30 PM IST
అందాల భామ‌కు ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అత‌డే!
X

ట్రిప్తీ దిమ్రీ అనే ఒక న‌టి భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉంద‌నే విష‌యం `యానిమ‌ల్` రిలీజ్ త‌ర్వాతే తెలిసింది. దీనికి సృష్టిక‌ర్త సందీప్ రెడ్డి వంగా అనే తెలుగు ద‌ర్శ‌కుడు. ట్రిప్తి దిమ్రీ తొలి పెద్ద విజ‌యం అందుకుని అంత‌కుమించిన మ‌రో బిగ్గెస్ట్ ఆఫ‌ర్ ని అందుకోవ‌డానికి కూడా సందీప్ రెడ్డి వంగా కార‌కుడు. అత‌డు అనూహ్యంగా దీపిక స్థానంలో ట్రిప్తి దీమ్రీకి `స్పిరిట్` చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం క‌ల్పించ‌డం అతిపెద్ద మ‌లుపు.





ఇన్ని మ‌లుపుల త‌ర్వాత ట్రిప్తి త‌న స‌మ‌ర్థ‌త‌ను నిరూపించు కోవాల్సిన కీల‌క స‌మ‌య‌మిది. ఈ స‌మ‌యంలో స్పిరిట్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే, గ్యాప్ లో ట్రిప్తి బోలెడంత హంగామా సృష్టిస్తోంది. గ‌త‌ రాత్రి దిల్జీత్ దోసాంజ్ కాన్సెర్ట్ లో ర‌చ్చ చేసిన ట్రిప్తి అదిరిపోయే స్టైలిష్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది. దిల్జిత్‌ను ట్యాగ్ చేస్తూ ``ఎంత అద్భుతమైన రాత్రి ఇది!`` అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కాన్సర్ట్ నైట్ కోసం తృప్తి డిమ్రి ఎంచుకున్న ఫ్యాషన్ స్టైలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షిమ్మరీ ఫినిష్- సాఫ్ట్ డ్రేప్డ్ స్కార్ఫ్ నెక్‌లైన్‌తో కూడిన బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్‌లో ట్రిప్తీ ఎంతో గ్లామరస్‌గా కనిపించారు.





తృప్తి డిమ్రి ఇంత రిలాక్స్‌డ్‌గా.. కాన్ఫిడెంట్‌గా ముందుకు సాగుతున్నారంటే దానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సృజనాత్మకతపై ఉన్న నమ్మకమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే వంగా విషయంలో త‌ను కూడా అంతే భక్తి, గౌరవభావంతో మెలుగుతున్నారు. మరోవైపు షూటింగ్ సెట్స్‌లో ప్రభాస్ తినిపించే వెరైటీ వంటకాలతో ట్రిప్తి మరింత ఉత్సాహంగా జోష్‌తో కనిపిస్తున్నట్లు చర్చలు నడుస్తున్నాయి.





`స్పిరిట్`తో పాటు తృప్తి డిమ్రి నటిస్తున్న తదుపరి చిత్రాల జాబితాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులు- విభిన్న కథాంశాలతో ముందుకు సాగుతున్న ఈ బ్యూటీ కెరీర్ ప్రయాణం మునుముందు మ‌రిన్ని భారీ చిత్రాల‌తో కొత్త మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ద‌శ‌లో త‌న అందంతోనే కాదు, న‌ట ప్ర‌తిభ‌తోను ఇంకా మెప్పించాల్సి ఉంటుంది. పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స్పిరిట్` చిత్రంలో బ‌ల‌మైన పాత్ర‌తో ట్రిప్తి త‌న‌ను తాను నిరూపించాల్సి ఉంటుంది. ట్రిప్తి దిమ్రీ కేవ‌లం గ్లామ‌ర‌స్ డాళ్ మాత్ర‌మే కాదు.. మంచి న‌టి అన్న గుర్తింపు ఇంకా రావాల్సి ఉంది.