Begin typing your search above and press return to search.

త్రిప్తి డిమ్రి ఆ తప్పు పని చేస్తుందా ఏంటి..?

రణబీర్‌ కపూర్‌, సందీప్‌ వంగ కాంబోలో వచ్చిన 'యానిమల్‌' సినిమాలో చిన్న పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి ఓవర్‌ నైట్‌ స్టార్‌గా నిలిచింది.

By:  Ramesh Palla   |   12 Aug 2025 5:00 PM IST
త్రిప్తి డిమ్రి ఆ తప్పు పని చేస్తుందా ఏంటి..?
X

రణబీర్‌ కపూర్‌, సందీప్‌ వంగ కాంబోలో వచ్చిన 'యానిమల్‌' సినిమాలో చిన్న పాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి ఓవర్‌ నైట్‌ స్టార్‌గా నిలిచింది. ఆ సినిమాలో ఉన్నది కొంత సమయం అయినా బోల్డ్‌ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేసుకుంటూ దూసుకు పోతుంది. యానిమల్‌ సినిమాతో వచ్చిన పాపులారిటీతో వరుస సినిమాలు చేస్తున్న త్రిప్తి డిమ్రికి ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ విజయాలు దక్కడం లేదు. ఇప్పటి వరకు యానిమల్‌ స్థాయి విజయం దక్కలేదు. ఎట్టకేలకు మళ్లీ సందీప్ రెడ్డి వంగ నుంచి త్రిప్తికి పిలుపు వచ్చింది. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న స్పిరిట్‌ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రిని ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

ధడక్‌ 2 తో నిరాశ పరచిన త్రిప్తి డిమ్రి

గత రెండేళ్లుగా త్రిప్తి డిమ్రి చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరుస్తూనే ఉన్నాయి. ఇటీవల వచ్చిన ధడక్ 2 సినిమా సైతం అంతంత మాత్రమే అన్నట్లు గా నిలిచింది. ఆ సినిమా కాకుండా రోమియో సినిమాతో రాబోతుంది. ఆ సినిమా పైనా ఈమె ఆశలు పెట్టుకంఉది. కనీసం ఆ సినిమా అయినా ఆకట్టుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమాలో నటించేందుకు ఎంపిక అయిన నేపథ్యంలో త్రిప్తి కొత్తగా ఎక్కువ సినిమాలకు కమిట్‌ కావడం లేదు. ప్రభాస్‌ తో సినిమా తర్వాత ఖచ్చితంగా త్రిప్తి మరింత బిజీ కావడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అందుకే ఆమె హిందీతో పాటు ఇతర భాషల్లోనూ త్రిప్తి కొత్త సినిమాలకు దూరంగా ఉండాలని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య, వెంకీ అట్లూరి కాంబో మూవీ

ఈ సమయంలో త్రిప్తి తమిళ్‌ హీరో సూర్య సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాకు విశ్వనాథన్‌ అండ్‌ సన్స్ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మమితా బైజును ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయింది. త్వరలోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ వస్తుందని మేకర్స్‌ నుంచి ప్రకటన వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

స్పిరిట్‌ సినిమాలో త్రిప్తి డిమ్రి

ఇప్పటికే ఒక హీరోయిన్‌ ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా అయితే ఓకే కానీ సెకండ్‌ హీరోయిన్‌గా సినిమా చేయడం ఏంటి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ వంటి సూపర్‌ స్టార్‌తో స్పిరిట్‌ సినిమాను చేయబోతున్న ఈ అమ్మడు ఎందుకు సూర్య సినిమాకు ఓకే చెప్పింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు త్రిప్తి డిమ్రి ని ఎంపిక చేసినట్లు వెంకీ అట్లూరి లేదా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కనుక ఈ వార్తల్లో నిజం ఉండక పోవచ్చు అంటున్నారు.

ఒక వేళ ఈ సినిమాలో త్రిప్తి నిజంగా ఉంటే ఖచ్చితంగా ఈ నిర్ణయంను చాలా మంది తప్పుబడుతారు. స్పిరిట్‌ సినిమాలో నటించే ముందు ఇలాంటి చిన్న సినిమాను, సెకండ్‌ హీరోయిన్‌ పాత్రను చేయడం అనేది అతి పెద్ద తప్పుడు నిర్ణయం అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి త్రిప్తి స్పందన ఏంటి అనేది చూడాలి.