Begin typing your search above and press return to search.

'స్పిరిట్‌' హీరోయిన్‌కి ఊరట దక్కినట్లేనా...!

వరుసగా ఫ్లాప్స్ పడుతున్న సమయంలో, తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో త్రిప్తికి 'ధడక్‌ 2' కాస్త ఊరట కలిగించిందని చెప్పాలి.

By:  Ramesh Palla   |   4 Aug 2025 12:10 PM IST
స్పిరిట్‌ హీరోయిన్‌కి ఊరట దక్కినట్లేనా...!
X

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దాదాపు ఐదేళ్ల తర్వాత 'యానిమల్‌' సినిమాతో త్రిప్తి డిమ్రికి బ్రేక్‌ దక్కింది. రణబీర్‌ కపూర్‌ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమాలో త్రిప్తి చిన్న పాత్రలోనే నటించింది. అయినా కూడా హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న పాత్ర కంటే త్రిప్తి పాత్రకు వెయిట్‌ ఎక్కువ లభించింది. అంతే కాకుండా ఆ సినిమాతో త్రిప్తి బాలీవుడ్‌లో ఒక్కసారిగా స్టార్‌ అయింది. యానిమల్‌ విడుదలకు ముందు త్రిప్తి ఇండస్ట్రీలో సగానికి పైగా తెలియదు. కానీ ఎప్పుడైతే యానిమల్‌ హిట్‌ పడిందో అప్పటి నుంచి త్రిప్తి గురించి చర్చ మొదలైంది. 2023 చివర్లో యానిమల్‌ సినిమాతో వచ్చిన త్రిప్తికి ఆ ఒక్క సినిమా కారణంగా గత ఏడాది అంటే 2024లో ఏకంగా మూడు సినిమాలు చేసే అవకాశం దక్కింది. త్రిప్తి వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది.

ధడక్‌ 2 కి పాజిటవ్ రెస్పాన్స్‌

గత ఏడాదిలో త్రిప్తి నటించిన బాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భులయ్యా 3 సినిమాలు విడుదల అయ్యాయి. మూడు సినిమాలు కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో త్రిప్తి పై మెల్ల మెల్లగా నెగిటివిటీ ప్రారంభం అయింది. ఈ ఏడాది అది కాస్త ఎక్కువ అయింది. త్రిప్తిని కావాలని కొందరు బాలీవుడ్‌కు చెందిన సీనియర్‌ హీరోయిన్స్‌ పీఆర్‌ టీమ్స్ టార్గెట్‌ చేశాయి, నెగిటివ్‌గా ప్రచారం చేస్తున్నారు అనే చర్చ మొదలైంది. ఆ సమయంలో ప్రభాస్ స్పిరిట్‌ సినిమా నుంచి దీపికా పదుకునేను తొలగించి త్రిప్తిని ఎంపిక చేయడంతో ఒక్కసారిగా ఆమె గురించిన చర్చ జరగడం మొదలైంది. త్రిప్తిని డీగ్రేడ్‌ చేస్తూ విమర్శలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. వరుసగా ఫ్లాప్స్ పడుతున్న సమయంలో, తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో త్రిప్తికి 'ధడక్‌ 2' కాస్త ఊరట కలిగించిందని చెప్పాలి.

జాన్వీ కపూర్‌ ధడక్‌ కి సీక్వెల్‌గా ధడక్‌ 2..?

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం ధడక్‌. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోక పోయినా జాన్వీ మొదటి సినిమా కావడం వల్ల అందరికీ గుర్తుండి పోయింది. అందుకే ఆ ప్రాంచైజీలో లవ్‌ స్టోరీతో సిద్దాంత్‌ చతుర్వేది హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించిన 'ధడర్‌ 2' వచ్చింది. సినిమాకు మొదటి నుంచి కూడా కాస్త నెగటివ్‌ ప్రచారం ఉంది. దాంతో ఓపెనింగ్ ఆశించిన స్థాయిలో అందుకోలేదు. కానీ సినిమా విడుదల తర్వాత మెల్ల మెల్లగా మౌత్‌ టాక్‌తో పాజిటివ్‌ కలెక్షన్స్ వైపు అడుగులు పడుతున్నాయి. రెండో వారంకు ఖచ్చితంగా సినిమా పుంజుకుంటుందనే నమ్మకంను మేకర్స్‌తో పాటు, బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్పిరిట్‌ కోసం త్రిప్తి డిమ్రి వెయిటింగ్‌

ధడక్‌ 2 సినిమాలో త్రిప్తి డిమ్రి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సింపుల్‌ అమ్మాయి లుక్‌లో త్రిప్తి మెప్పించింది. యానిమల్‌ తర్వాత ఆ స్థాయిలో పాజిటివ్‌ టాక్‌ ఈ సినిమాకు, అందులోని పాత్రకు దక్కడం విశేషం. గత ఏడాది మొత్తం విమర్శలు ఎదుర్కొన్న త్రిప్తి, మొన్నటి వరకు సోషల్‌ మీడియాలో టార్గెట్‌ అయిన త్రిప్తికి ధడక్‌ 2 సినిమా చాలా పెద్ద రిలీఫ్‌ ను ఇచ్చినట్లు అయిందని ఇండస్ట్రీ వర్గాల వారు, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఆమెను అభిమానించే వారు కామెంట్స్ చేస్తున్నారు. త్రిప్తి డిమ్రి ఇదే జోష్‌తో మరిన్ని సినిమాల్లో నటించాలని, త్వరలో నటించబోతున్న ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సందీప్‌ వంగ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ త్రిప్తి డిమ్రిని స్పిరిట్‌ సినిమాకు తీసుకున్నాడు. దాంతో ఆయన ఖచ్చితంగా స్పిరిట్‌ తో త్రిప్తికి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. ఈ ఏడాది చివరి నుంచి స్పిరిట్ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. స్పిరిట్‌ సినిమా కమిట్ అయిన కారణంగా త్రిప్తి కొత్తగా సినిమాలు కమిట్‌ కావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. స్పిరిట్‌ సినిమా తర్వాత త్రిప్తి తన రెమ్యూనరేషన్‌ ను రెండు మూడు రెట్లు పెంచే అవకాశాలు ఉన్నాయనే టాక్‌ సైతం వినిపిస్తుంది.