స్పిరిట్ హీరోయిన్ ఎనర్జీ బూస్టర్ ఇదే...
బాలీవుడ్ లోనే కాకుండా ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా తృప్తి డిమ్రి గురించి ప్రముఖంగా వినిపిస్తోంది.
By: Ramesh Palla | 3 Dec 2025 5:00 PM ISTబాలీవుడ్ లోనే కాకుండా ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా తృప్తి డిమ్రి గురించి ప్రముఖంగా వినిపిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలు ఈమె పోషించిన పాత్ర చిన్నదే అయినప్పటికీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనే విషయం అందరికీ తెలిసిందే. యానిమల్ సినిమా తర్వాత తృప్తి డిమ్రి ఏకంగా 10 సినిమాలను చేసింది. అందులో ఎక్కువ శాతం గ్లామర్ రోల్స్ ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆమె క్రేజీ ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే స్పిరిట్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు లాంచనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై సినిమాను ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రారంభం కావడంతో తృప్తి డిమ్రి కూడా సంతోషం వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో తృప్తి డిమ్రి...
వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండే తృప్తి డిమ్రి మరోవైపు సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను షేర్ చేయడం మాత్రమే కాకుండా తన రొటీన్ లైఫ్ ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకోవడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా తన ఎనర్జీ బూస్టర్ అంటూ ఒక చిన్న వీడియోని షేర్ చేసింది. మనలో చాలా మందికి అలసటగా ఉన్నప్పుడు టీ తాగడం అలవాటుగా ఉంటుంది. టీ తాగితే చాలా వరకు రిప్రెషన్ అయినట్లుగా అనిపిస్తుంది. మనలో చాలా మంది టీ తాగడం ద్వారా తిరిగి ఎనర్జీ పొందినట్లు ఫీల్ పొందుతారు. హీరోయిన్ తృప్తి కూడా తన ఎనర్జీ బూస్టర్ చాయ్ బిస్కెట్ అంటూ ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పింది. చాయ్ బిస్కెట్ ఎంతో ఇష్టంగా తింటాను అంటూ తృప్తి తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ ద్వారా వీడియోను షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. షూటింగ్ గ్యాప్ లో తృప్తి ఇలా చాయ్ బిస్కెట్ తింటూ తిరిగి ఎనర్జీని సొంతం చేసుకుని షూటింగ్లో పాల్గొంటున్నట్లుగా ఈ వీడియోని చూస్తే అర్థమవుతుంది. చాలామంది స్టార్స్ కి కూడా కాఫీ లేదా టీ ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుందని అంటారు.
బాలీవుడ్ వరుస సినిమాల్లో తృప్తి...
2017లో హిందీ చిత్రం పోస్టర్ బాయ్స్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన తృప్తి ఆశించిన స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకోలేక పోయింది. ఆ వెంటనే లైలా మజ్ను సినిమాతో 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా పెద్దగా గుర్తింపుని తెచ్చి పెట్టలేదు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్లో నటించడం ద్వారా ఇండస్ట్రీలో కొనసాగాలని ఈమె భావించింది. ఆ సమయంలో వచ్చిన యానిమల్ సినిమా అవకాశం ఈమె కెరియర్ మలుపు తిప్పింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కి జోడిగా నటించడంతో ఒకసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉన్న కారణంగా యూత్ దృష్టిని ఆకర్షించడంలో ఈ అమ్మడు సక్సెస్ అయింది. అందువల్లే బాలీవుడ్ నుంచి ఈమెకి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకి సినిమా అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పిరిట్ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈమె మరిన్ని సినిమాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ సినిమా కోసం ఈమె భారీ పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం అందుతుంది.
ప్రభాస్ సందీప్ రెడ్డివంగా మూవీలో...
పాన్ ఇండియా సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ చేస్తున్న మూవీ కావడంతో స్పిరిట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాను తన గత చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా తీస్తాడని నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి భారీ స్కేల్ ఉన్న సినిమాలో తృప్తి నటించడం ద్వారా కెరియర్లో చాలా పెద్ద మూవీగా స్పిరిట్ నిలుస్తుంది అనే విశ్వాసం ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఏకంగా 60 లక్షలకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. వారంతా ఇప్పుడు తృప్తి ని స్పిరిట్ సినిమాలో ఎలా చూస్తామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది కనుక ఏ క్షణంలోనైనా స్పిరిట్ సినిమాలోని తృప్తి లుక్ రివీల్ అయ్యే అవకాశం ఉంది. దీపికా పదుకొనే వంటి స్టార్ హీరోయిన్ నటించాల్సిన పాత్రలో ఈమె నటిస్తున్న కారణంగా సహజంగానే కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. కాని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ప్రతిభతో తృప్తిని పూర్తిగా పాత్రలో లీనం అయ్యే విధంగా నటింప చేస్తాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
