Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : బ్లాక్‌ ఔట్‌ ఫిట్‌లో అందాల త్రిప్తి

త్రిప్తి డిమ్రి సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది.

By:  Ramesh Palla   |   11 Aug 2025 1:18 PM IST
పిక్‌టాక్ : బ్లాక్‌ ఔట్‌ ఫిట్‌లో అందాల త్రిప్తి
X

'యానిమల్‌' సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిన త్రిప్తి డిమ్రి ఆ వెంటనే బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేసింది, ఇంకా ఆమె చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్‌ సినిమాలో త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఎంపిక చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. బాలీవుడ్‌లో ఇటీవల ఈమె నటించిన సినిమాలు వరుసగా వచ్చాయి. అయితే యానిమల్‌ సినిమా తెచ్చి పెట్టిన స్థాయిలో మరే సినిమా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అయినా కూడా సినిమాలు చేస్తూ తన ప్రయత్నాలు చేస్తుంది. యానిమల్‌ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఒక బిగ్‌ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం దక్కడంతో త్రిప్తి డిమ్రి ఆ ప్రాజెక్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ ఏడాది చివరి నుంచి స్పిరిట్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రకటించాడు.


యానిమల్‌ సినిమాతో త్రిప్తి డిమ్రి స్టార్‌డం

త్రిప్తి డిమ్రి సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంది. యానిమల్‌ సినిమా తర్వాత సోషల్‌ మీడియాలో ఈమె ఫాలోయింగ్‌ విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లుగానే ఈ అమ్మడి జోరు, అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు, గ్లామర్‌ ఔట్‌ ఫిట్‌ లో ఆకట్టుకునే రూపం ఈ అమ్మడి సొంతం. అందుకే ఈ అమ్మడికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఇలాంటి అందమైన ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఆకట్టుకుంటూ ఉంది. అందమైన ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న ఫోటోలు వీడియోల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అందాల ఔట్‌ ఫిట్‌ లో త్రిప్తి డిమ్రి ఆకట్టుకుంటుందని మరోసారి ఈ బ్లాక్ డ్రెస్ ఫోటోలతో నిరూపితం అయిందని అభిమానులు, నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.


బ్లాక్‌ డ్రెస్‌లో క్లీవేజ్ షో తో మెరుపులు

సాధారణంగానే త్రిప్తి డిమ్రి చాలా అందంగా ఉంది. ఈ అమ్మడి అందంను మరింతగా పెంచే విధంగా బ్లాక్‌ డ్రెస్ ఉందని, క్లీ వేజ్ షో చేస్తూ, థైస్ ను ఎక్స్‌పోజ్‌ చేయడం ద్వారా త్రిప్తి చూపు తిప్పనివ్వడం లేదు. ఆమె మేకోవర్‌ తో పాటు, హెయిర్‌ డ్రెస్సింగ్‌ సైతం చాలా అందంగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందుకే ఏ ఔట్‌ ఫిట్‌లో అయినా ఈ అమ్మడు చాలా అందంగా ఉంటుంది. యానిమల్‌ సినిమాలో బోల్డ్‌ గా నటించిన ఈ అమ్మడి నుంచి ఎప్పుడూ అభిమానులు గ్లామర్‌ ను కోరుకుంటున్నారు. అందుకే తన ఇంతకు ముందు సినిమాలు, ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సైతం గ్లామర్‌గా కనిపించేందుకు గాను ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.


రష్మిక మందన్న కంటే త్రిప్తి డిమ్రికి క్రేజ్ ఎక్కువ

త్రిప్తి డిమ్రి యానిమల్‌ సినిమాకు ముందు వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ వెబ్‌ సిరీస్‌ పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. అంతే కాకుండా అంతకు ముందు ఆమె చేసిన ఏ ప్రాజెక్ట్‌ ఆమెను స్టార్‌గా నిలపలేదు. సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత లక్కీగా త్రిప్తి డిమ్రికి యానిమల్‌ ఛాన్స్ దక్కి ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ సినిమాలో రణబీర్‌ కపూర్‌కి జోడీగా నటించిన రష్మిక మందన్న కంటే కూడా గ్లామర్‌ పాత్రలో నటించి, బోల్డ్‌ సీన్స్ చేసిన త్రిప్తి డిమ్రికి ఎక్కువ గుర్తింపు దక్కింది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి జోరు ఓ రేంజ్‌ పెరిగింది. అందుకు తగ్గట్లుగానే అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంది, అంతే కాకుండా అందమైన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా సినిమాల్లోనూ బలమైన పాత్రలు వస్తున్నాయి. స్పిరిట్‌ సినిమా తర్వాత త్రిప్తి బాలీవుడ్‌లో మరింత బిజీగా మారే అవకాశాలు ఉన్నాయి.