Begin typing your search above and press return to search.

హిట్లు ఇచ్చినా అత‌డు ఇంకా అక్క‌డే!

త్రినాధ‌రావు న‌క్కిన ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్`, `హలో గురు ప్రేమకోసమే, `ధమాకా` వంటి విజయాలతో త‌న‌కంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు.

By:  Srikanth Kontham   |   30 March 2026 8:00 PM IST
హిట్లు ఇచ్చినా అత‌డు ఇంకా అక్క‌డే!
X

త్రినాధ‌రావు న‌క్కిన ప‌రిచయం అవ‌స‌రం లేని పేరు. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్`, `హలో గురు ప్రేమకోసమే, `ధమాకా` వంటి విజయాలతో త‌న‌కంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు, వినోదం , కమర్షియల్ హంగులను సమపాళ్లలో మిళితం చేయడంలో ఆయన దిట్ట. ఇలాంటి డైరక్ట‌ర్ల‌కు టాలీవుడ్ లో డిమాండ్ బాగానే ఉంటుంది. టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ లోచేర‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌దు.

కెరీర్ గ్రాఫ్ ప‌రిశీలిస్తే ప్లాప్ కంటే హిట్లే ఎక్కువ ఉన్నాయి. కానీ కానీ త్రినాధ‌రావు ఈ రెండు విభాగాల్లోనూ ఇంకా వెనుక‌బ‌డే ఉన్నారు.

స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే కోరిక, అగ్ర నిర్మాణ సంస్థల నుంచి పిలుపు అందుకోవాలనే ఆశ ప్రతి దర్శకుడికి ఉంటుంది. కానీ త్రినాధరావుకు మాత్రం అటువంటి పెద్ద ప్రాజెక్టులు ఆశించిన స్థాయిలో దక్కడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొత్త తరం దర్శకులు వినూత్నమైన కాన్సెప్టులతో సరికొత్త కథనాలతో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచులు మారడంతో పాటు చిన్న దర్శకులు కూడా భారీ ప్లానింగ్‌తో సినిమాలు చేస్తూ అగ్ర దర్శకులకు గట్టి పోటీ ఇస్తున్నారు.

మ‌రి త్రినాధ‌రావు ఎందుకు వెనుక‌బ‌డుతున్నాడు? అగ్ర ద‌ర్శ‌కుల‌కు పోటీగా ఎందుకు వెళ్లలేక‌పోతున్నారంటే? పోటీ ప్రపంచంలో కేవలం కమర్షియల్ ఫార్ములా సినిమాలు మాత్రమే సరిపోవు. కథలో లోతు , వినూత్నత ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇది త్రినాధరావుకు కొంత ప్రతికూలంగా మారింద‌న్న‌ది వాస్త‌వం. మరోవైపు తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. `బాహుబలి` , `పుష్ప` లాంటి భారీ విజువల్స్ , గ్రాండ్ ఎమోషన్స్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ క్రమంలో పాన్-ఇండియా స్థాయికి తగ్గ కథలను సిద్ధం చేసుకోవడంలో లేదా అటువంటి బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయడంలో త్రినాధరావు వెనుకబడిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తన పాత ఫార్ములానే నమ్ముకోవడం వల్ల పెద్ద హీరోల దృష్టిని ఆకర్షించలే కపోతున్నారని వినిపిస్తోంది. ఎంట‌ర్ టైన్ మెంట్ వ‌ర‌కూ త్రినాధ‌రావు విష‌యంలో చూడాల్సిన ప‌నిలేదు. కానీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలను మెప్పించాలంటే కేవలం వినోదం మాత్రమే సరిపోదు. దాంతో పాటు భారీ కథాంశం కూడా ఉండాలి. ఆ స్థాయి మేకింగ్ వైపు ఆయన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. త్రినాధరావు నక్కిన ప్రతిభకు ఎలాంటి కొదవ లేదు. ఒక దర్శకుడిగా తనను తాను మార్చు కుంటూ పాత ఫార్ములాను వ‌దిలి సరికొత్త ప్రయోగాలకు సిద్ధమైతే తప్ప స్టార్ హీరోల సినిమాలు దక్కడం కష్టం అనే మాట బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం త్రినాధ‌రావు `నేను రెడీ` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.