అప్పుడు మేం వయసుకు వచ్చాం.. ఇప్పుడు 'అనకాపల్లి'
డైరెక్టర్‌గా కమర్షియల్ హిట్స్ కొట్టిన త్రినాధరావు నక్కిన, ఇప్పుడు నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్నారు.
By: M Prashanth | 30 Sept 2026 6:44 PM ISTడైరెక్టర్‌గా కమర్షియల్ హిట్స్ కొట్టిన త్రినాధరావు నక్కిన, ఇప్పుడు నిర్మాతగా కూడా అడుగులు వేస్తున్నారు. నటుడిగా కూడా బిజి అయ్యేలా కనిపిస్తున్నారు. డైరెక్షన్ కంటే ప్రొడక్షన్ చాలా కష్టమని, టెన్షన్లతో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదంటూ అనకాపల్లి ప్రెస్ మీట్ వేదికగా ఆయన ఓపెన్ అయ్యారు. అయితే లాభాల కోసం కాకుండా, కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకే తాను ఈ ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు.
ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఆయన ఒక పాత ఫ్లాష్‌బ్యాక్ గుర్తుచేసుకున్నారు. దర్శకుడిగా తనకు లైఫ్ ఇచ్చిన 'మేము వయసుకు వచ్చాం' మూవీ ప్రెస్ మీట్ కూడా ఇదే స్టేజ్ మీద జరిగిందని, అప్పట్లో జనాలు కింద కూర్చుని మరీ సినిమా చూశారని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆ సినిమానే తనకి దర్శకుడిగా గుర్తింపు తెచ్చిందని అన్నారు.
ఆ హిట్ తర్వాత పూర్తిగా కమర్షియల్ ట్రాక్ ఎక్కేసిన ఆయన, మళ్లీ అలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎందుకు తీయలేదని చాలామంది అడిగేవారట. ఇండస్ట్రీ పెద్దలు సైతం అదే ప్రశ్న అడగడంతో, మళ్లీ ఆ తరహా మ్యాజిక్ రిపీట్ చేసే ఉద్దేశంతోనే 'అనకాపల్లి' కంటెంట్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో యూత్‌తో పాటు ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యే బలమైన డ్రామా ఉందంటూ ఆయనే స్వయంగా భరోసా ఇచ్చారు.
సినిమా కోసం నటీనటులు పడిన కష్టం గురించి చెబుతూ త్రినాధరావు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. హీరో విక్రమ్ సహిదేవ్ ఎలాంటి డూప్ లేకుండా, కింద సేఫ్టీ బెడ్స్ కూడా వేసుకోకుండా యాక్షన్ సీన్స్ చేశాడని క్లారిటీ ఇచ్చారు. టౌన్ అమ్మాయి పాత్ర కోసం హీరోయిన్ సంధ్య అద్భుతంగా మేకోవర్ అయ్యిందని మెచ్చుకున్నారు. ఇక నిర్మాత నాయుడు గారిని ఒకసారి ఎండలో రఫ్ లుక్‌లో చూసి, తానే స్వయంగా అడిగి ఇందులో పవర్ఫుల్ నెగెటివ్ రోల్ చేయించినట్లు అసలు సీక్రెట్ లీక్ చేశారు.
సినిమా అవుట్‌పుట్ మీద కాన్ఫిడెన్స్‌తో ఇప్పటికే ఒక స్పెషల్ షో వేశామని, అక్కడి నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందని త్రినాధరావు చెప్పుకొచ్చారు. అయితే ఆ సెలబ్రేషన్ విజువల్స్‌ను కావాలనే పబ్లిసిటీ కోసం వాడుకోకూడదనే ఉద్దేశంతో సీక్రెట్‌గా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా సినిమాకు ఏది కావాలో అదే దానంతట అదే సెట్ అయిపోయిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అక్టోబర్ 2న అమెరికాతో సహా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోందని ప్రకటించారు. ఇక్కడితో ఆగిపోకుండా, కొత్తవాళ్ల కోసం భవిష్యత్తులో కూడా ఇదే బ్యానర్‌పై మరిన్ని సినిమాలు నిర్మిస్తానని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక తన కెరీర్‌ను మలుపు తిప్పిన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన పంచుకున్న విషయాలు, ఇప్పుడు 'అనకాపల్లి' సినిమాపై ట్రేడ్‌లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
