Begin typing your search above and press return to search.

'అనకాపల్లి' టీమ్ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు.. రియల్ వైన్ షాప్ లో డేరింగ్ సీన్..

త్వరలో థియేటర్లలోకి రాబోతున్న రా అండ్ రస్టిక్ మూవీ 'అనకాపల్లి'. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల ప్రత్యేకంగా తుపాకీ.కామ్ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.

By:  M Prashanth   |   6 Aug 2026 11:37 AM IST
అనకాపల్లి టీమ్ ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు.. రియల్ వైన్ షాప్ లో డేరింగ్ సీన్..
X

త్వరలో థియేటర్లలోకి రాబోతున్న రా అండ్ రస్టిక్ మూవీ 'అనకాపల్లి'. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇటీవల ప్రత్యేకంగా తుపాకీ.కామ్ కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నిర్మాత త్రినాథరావు నక్కిన, హీరో విక్రమ్, విలన్ తారక్ పొన్నప్ప, హీరోయిన్ సంధ్యా వశిష్ట ఈ చిట్ చాట్ లో పాల్గొని సినిమాకి సంబంధించిన బోలెడు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ గా ఎందుకంటే..

డైరెక్టర్ గా ఎన్నో హిట్లు ఇచ్చిన త్రినాథరావు నక్కిన ఈ సినిమాతో నిర్మాతగా మారారు. దీనికి కారణం ఏంటని అడిగితే.. తన దగ్గర చాలా మంచి కథలు ఉన్నాయని, అవన్నీ తానే డైరెక్ట్ చేయాలంటే కుదరదని చెప్పారు. అందుకే ఇండస్ట్రీలో ఒక కొత్త ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసి, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే తన ఫ్రెండ్ నాయుడుతో కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారట. ఇక డైరెక్టర్ ఖగేష్ తనకు ఎప్పట్నుంచో తెలుసని, షార్ట్ ఫిల్మ్స్ తీసే టైమ్ నుంచే అతని టాలెంట్ మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించానని చెప్పారు. బిజినెస్ పరంగా భయం ఉన్నా సరే, మంచి కథలను వదులుకోలేక ఈ స్టెప్ వేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఆన్లైన్ ఆడిషన్.. రెండు రోజుల్లోనే ఫ్లైట్..

హీరో విక్రమ్ జర్నీ ఈ సినిమాకి భలే ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. త్రినాథరావు గారు ఎప్పుడో ఐదేళ్ల క్రితం చూసిన విక్రమ్ వీడియోని మైండ్ లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ కి ఫిక్స్ అయిపోయారట. విక్రమ్ అప్పుడు వేరే కంట్రీలో ఉంటే, ఆన్లైన్ లో ఆడిషన్ తీసుకుని కేవలం రెండు రోజుల్లోనే ఫ్లైట్ ఎక్కించి షూటింగ్ కి తీసుకొచ్చేశారట. ఎలాంటి ప్రిపరేషన్, రిహార్సల్స్ లేకుండా డైరెక్ట్ గా సెట్ లోకి వెళ్లిపోయానని విక్రమ్ చెప్పుకొచ్చాడు. సినిమాలో తండ్రి కొడుకుల మధ్య గ్యాప్, దాన్ని బ్యాలెన్స్ చేసే తల్లి పాత్ర.. ఇలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ కథలో బాగా వర్కౌట్ అయ్యాయని అన్నాడు.

రియల్ వైన్ షాప్ లో డేరింగ్ సీన్..

హీరోయిన్ సంధ్య వశిష్ట ఈ సినిమాలో ఒక డేరింగ్ సీన్ చేసింది. సాధారణంగా వైన్ షాప్ సీన్స్ అంటే సెట్ వేస్తారు. కానీ ఈ మూవీలో ఏకంగా అనకాపల్లిలోని ఒక రియల్ వైన్ షాప్ కి వెళ్లి, నిజమైన కస్టమర్ల మధ్య సీన్ చేశారట. ఒక అమ్మాయి అలా నిజంగా వైన్ షాప్ దగ్గరికి వెళ్లి పరిగెత్తే సీన్ చేయడం అక్కడున్న వాళ్లందరికీ షాక్ ఇచ్చిందని టీమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ సీన్ వెనుక చాలా ఎమోషనల్ రీజన్ ఉంటుందని, అది ట్రైలర్ లో కట్ చేసినట్టు రాంగ్ వే లో ఉండదని, థియేటర్లో చూస్తేనే ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పారు. అలాగే సీనియర్ నటి ఇంద్రజ గారితో కలిసి నటించడం తనకు దొరికిన బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అని సంధ్య చెప్పింది.

ఆ రెండు క్యారెక్టర్ల మధ్యే అసలు వార్

ఇక ఈ సినిమాలో విలన్ గా చేసిన తారక్ పొన్నప్ప క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ఇందులో తనది చాలా హైపర్ అండ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ అట. విక్రమ్ క్యారెక్టర్ ఒక అండర్ డాగ్ లా ఉంటే, తన క్యారెక్టర్ ఏమో ఫుల్ ఫైర్ మీద ఉంటుందని, ఈ రెండు భిన్నమైన మనస్తత్వాల మధ్య జరిగే వార్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పాడు. గతంలో తాను 'పుష్ప' సినిమాలో నటించినప్పుడు ఆ క్యారెక్టర్ ని ఎంతలా ఎంజాయ్ చేశాడో, ఈ అనకాపల్లి సినిమాలో క్యారెక్టర్ ని కూడా అంతే ఎంజాయ్ చేశానని తారక్ చెప్పడం విశేషం.

దీనితో పాటు ట్రైలర్ లో ఉన్న 'పిట్ట కథ' సస్పెన్స్ ని థియేటర్లలోనే రివీల్ చేస్తామని టీమ్ తెలిపింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ ఇచ్చిన ట్యూన్స్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయని త్రినాథరావు నక్కిన మెచ్చుకున్నారు. ఎక్కడా ఆర్టిఫిషియల్ గా లేకుండా, పక్కా లైవ్ లొకేషన్స్ లో రియలిస్టిక్ గా తెరకెక్కిన ఈ 'అనకాపల్లి' మూవీ ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని టీమ్ అంతా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.