Begin typing your search above and press return to search.

అనకాపల్లి.. జెన్ జీకి ఎమోషన్స్ నేర్పించే సినిమా: త్రినాథరావు నక్కిన ఇంటర్వ్యూ

'అనకాపల్లి' మూవీ రా అండ్ రస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

By:  M Prashanth   |   4 Aug 2026 8:56 PM IST
అనకాపల్లి.. జెన్ జీకి ఎమోషన్స్ నేర్పించే సినిమా:  త్రినాథరావు నక్కిన ఇంటర్వ్యూ
X

'అనకాపల్లి' మూవీ రా అండ్ రస్టిక్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్ చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ఒక కీలక పాత్ర కూడా పోషించారు. ఆగస్ట్ 7న ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నిర్మాతలు పంచుకున్న విశేషాలు ఇవే..

మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎలా మొదలైంది?

త్రినాథరావు నక్కిన: నాయుడు మా అనకాపల్లిలో చాలా సోషల్ సర్వీస్ చేసేవాడు. సినిమా రంగంలోకి వస్తానని చెప్పినప్పుడు నేను వద్దని వారించాను. కానీ పట్టుబట్టి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యాడు.

'అనకాపల్లి' కథను ఇప్పుడు పట్టాలెక్కించడానికి రీజన్?

త్రినాథరావు నక్కిన: ఈ స్టోరీ నేనే రాసుకుని పక్కన పెట్టేశాను. నేను డైరెక్టర్‌గా సెటిల్ అయ్యాక పరిస్థితులు మారాయి. నా దగ్గర ఉన్న బెస్ట్ స్టోరీలను మా బ్యానర్ల మీదే ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఫన్ ఏంటంటే, ఈ సినిమా దాదాపు నేనే డైరెక్ట్ చేసిన ఫీల్ ఉంటుంది.

లొకేషన్స్ ఎక్కడ ప్లాన్ చేశారు?

త్రినాథరావు నక్కిన: రియాలిటీ కోసం సినిమాను చాలా వరకు మా సొంతూరు అనకాపల్లిలోనే షూట్ చేశాము. ఇదొక టౌన్ బ్యాక్‌డ్రాప్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సొంతూరు మీద ప్రేమతో, కథకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని ఈ టైటిల్ ఫిక్స్ చేశాం.

కాండ్రేగుల నాయుడు: హోమ్ టౌన్‌లో షూటింగ్ చేయడం పెద్ద ప్లస్ అయింది, పోలీసులు, స్థానికులు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నేచురల్ లొకేషన్స్ వల్ల ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. దాదాపు 75 లొకేషన్లలో గ్రాండ్‌గా చిత్రీకరించాం.

కథ విషయంలో మీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంది?

కాండ్రేగుల నాయుడు: త్రినాథరావు గారు స్టోరీ చెప్పగానే నాకు బాగా కనెక్ట్ అయింది. ఎలాంటి మార్పులు చెప్పకుండా వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ఓకే చెప్పేశాను.

ప్రొడక్షన్ ఫీల్డ్ కష్టాలు ముందే తెలుసా?

కాండ్రేగుల నాయుడు: సినిమా అనేది చాలా మంది కష్టం, డబ్బులు పెడితే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. శ్రమ వాళ్లది, పేరు మాకు వస్తుందనే ఉద్దేశంతోనే బ్యానర్లు పెట్టి రెగ్యులర్‌గా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాం.

ఈ జనరేషన్‌కి ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు?

త్రినాథరావు నక్కిన: ఇప్పటి జెన్ జీ కి కుటుంబ అనుబంధాల గురించి సరిగ్గా తెలియట్లేదు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మళ్లీ వాళ్లకు పరిచయం చేయాలనే బాధ్యతతో ఈ మూవీ తీశాం. ఇందులో యాక్షన్ ఉన్నప్పటికీ, ఫ్యామిలీ డ్రామానే హైలైట్‌గా ఉంటుంది.

బడ్జెట్ అనుకున్నట్లే పూర్తయిందా? బిజినెస్ డీల్స్ ఎలా ఉన్నాయి?

త్రినాథరావు నక్కిన: నేను కూడా డైరెక్టర్‌ని కాబట్టి, క్వాలిటీ కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లాను. అలా ఒక 10 శాతం బడ్జెట్ పెరిగింది. అమెజాన్ ప్రైమ్‌తో ఓటీటీ చర్చలు జరుగుతున్నాయి. కంటెంట్ చూసి మైత్రి శశి గారు రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు.

మీరు చేసిన ఫాదర్ క్యారెక్టర్ గురించి చెప్పండి?

త్రినాథరావు నక్కిన: ప్రతీ డైరెక్టర్‌లో ఒక యాక్టర్ ఉంటాడు, నాకు యాక్టింగ్ వచ్చు. డైరెక్టర్, హీరో అంతా అడిగి నాతో ఈ క్యారెక్టర్ చేయించారు. ఈ పాత్రకు పొట్ట అవసరం అని డైరెక్టర్ అడిగితే, ప్రతిరోజూ సెట్‌కి వెళ్లేముందు బిర్యానీలు తినేవాడ్ని. సినిమాలో ఇంద్రజ గారు, సంధ్య, విక్రమ్ అంతా పోటీపడి నటించారు.

కాండ్రేగుల నాయుడు: త్రినాథరావు గారు మిడిల్ క్లాస్ ఫాదర్‌గా చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయన యాక్టింగ్ అందరికీ నచ్చుతుంది.

సినిమాకు మ్యూజిక్ ఎంతవరకు ప్లస్ అయింది?

త్రినాథరావు నక్కిన: 'ధమాకా' టైమ్‌లో కార్తీక్ ద్వారా పరిచయమైన దేవ్‌జండ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేను 'చౌర్యపాఠం'కి, రవితేజ గారు 'ఈగల్'కి అతనికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు 'అనకాపల్లి'కి కూడా అతన్నే సంప్రదించాం. ఆర్ఆర్, పాటలు అద్భుతంగా వచ్చాయి.

ఆగస్ట్ 7న బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది కదా?

త్రినాథరావు నక్కిన: మేం ఆగస్ట్ 7వ తేదీని ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాం. బాక్సాఫీస్ దగ్గర పోటీ అనేది ఎప్పుడూ కామనే. మా కంటెంట్ మీద మాకు, నాయుడికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే అదే తేదీకి వస్తున్నాం.

డైరెక్టర్ ఖగేష్ తమ్మినేని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది?

త్రినాథరావు నక్కిన: ఖగేష్ నాకు పదేళ్లుగా తెలుసు, సొంత తమ్ముడి లాంటివాడు. ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉంది. ప్రాజెక్ట్‌ను చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.

సెన్సార్ టాక్ ఎలా ఉంది?

త్రినాథరావు నక్కిన: ఫ్యామిలీ డ్రామా సెన్సార్ సభ్యులకు కూడా బాగా నచ్చింది, మంచి సినిమా తీశారని మెచ్చుకున్నారు. కట్స్ ఇస్తే కథ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని వాళ్లే ఫీల్ అయ్యారు.

మీ భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇద్దరూ కలిసే ట్రావెల్ అవుతారా?

కాండ్రేగుల నాయుడు: నా మనసు ఎప్పుడూ త్రినాథరావు గారితోనే ఉంటుంది, ఆయనతో ప్రయాణం కంటిన్యూ చేస్తాను. బెస్ట్ స్టోరీస్ వస్తే సోలోగా లేదా వేరే బ్యానర్లతో కలిసి సినిమాలు చేస్తాను.

త్రినాథరావు నక్కిన: 'నేను రెడీ' మూవీ కంప్లీట్ అయింది, రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తాం. డైరెక్టర్‌గా కొన్ని స్క్రిప్ట్స్ రెడీ చేశాను. ప్రొడ్యూసర్‌గా మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఉంటుంది. 'ధమాకా'ని మించే కథ దొరికితేనే 'ధమాకా-2' గురించి ఆలోచిస్తాను.