క్యూట్ త్రిధా కిల్లర్ బికినీ లుక్స్ వైరల్
ముఖ్యంగా పాపులర్ వెబ్ సిరీస్ `ఆశ్రమ్`లో అత్యుత్తమ నటనతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న త్రిధా ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.
By: Sivaji Kontham | 9 July 2026 7:00 AM ISTటాలీవుడ్ ప్రేక్షకులకు త్రిధా చౌదరి పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ చిత్రసీమలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ.. వెండితెరపైనే కాకుండా డిజిటల్ వేదికలపైనా సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా పాపులర్ వెబ్ సిరీస్ `ఆశ్రమ్`లో అత్యుత్తమ నటనతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న త్రిధా ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.
తాజాగా త్రిధా చౌదరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. బీచ్ బ్యాక్‌డ్రాప్‌లో హాట్ బికినీ లుక్‌లో ఉన్న ఫోటోలను షేర్ చేసిన ఈ భామ ``మాన్‌సూన్ బ్లూస్? మోర్ లైక్ మాన్‌సూన్ మ్యూస్`` అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. వర్షాకాలం వాతావరణంలోనూ తన పర్‌ఫెక్ట్ బీచ్ బాడీ.. గ్లామర్‌ను ఫిట్‌నెస్‌ను ఎలివేట్ చేస్తూ చేసిన ఈ ఫోటోషూట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. క్యూటీ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ రేంజ్ క్రేజ్‌ను త్రిధా చౌదరి కమర్షియల్‌గానూ ఎంతో స్మార్ట్‌గా ఉపయోగించుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి పెరిగిన ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకొని బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు క్యూ కడుతున్నాయి. ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల్లో ఒక్కో ప్రమోషనల్ యాడ్ పోస్ట్ లేదా కొల్లాబరేషన్‌కు త్రిధా భారీగానే వసూళ్లు సాధిస్తోందని టాక్. బ్రాండ్ వాల్యూని బట్టి ఒక్కో పోస్ట్‌కు లక్షల్లో పారితోషికం అందుకుంటూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ దూసుకుపోతోంది.
కేవలం యాడ్స్ మాత్రమే కాకుండా తన సొంత బ్రాండ్ ప్రమోషన్స్ .. ట్రావెల్ హోస్టింగ్‌లోనూ త్రిధా బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో `కిండ్రెడ్ బై త్రిధా`, `ట్రావెల్ విత్ త్రిధా` వంటి హ్యాష్ ట్యాగ్‌లతో క్యూరేటెడ్ ట్రావెల్ కంటెంట్‌ను అందిస్తూ సరికొత్త బిజినెస్ మోడల్‌ను రన్ చేస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. గతంలో గ్లామర్ పాత్రలకే పరిమితమైన ఈ భామ.. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ లేదా సినిమాకు త్రిథా తన క్రేజ్ ..పాత్ర నిడివిని బట్టి భారీగానే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్‌ను ఫాలో అయ్యే త్రిధా చౌదరి, అటు సినిమాలతోనూ..ఇటు సోషల్ మీడియా బిజినెస్ కమిట్‌మెంట్లతోనూ రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న తాజా మాన్‌సూన్ లుక్స్ యువతను తెగ ఆకట్టుకుంటూ సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్‌గా నిలిచాయి. 2026లో త్రిథా ఆఖరి సవాల్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది. తన తదుపరి సినిమా లేదా వెబ్ సిరీస్ ల గురించి త్రిథా అధికారికంగా వెల్లడిస్తుందేమో చూడాలి.
