ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ హీరోయిన్ కి మాతృ వియోగం!
ఆమె వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గీత సెప్టెంబర్ 21న తుది శ్వాస విడవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
By: Madhu Reddy | 22 Sept 2025 10:51 AM ISTచిత్ర పరిశ్రమలో వరుసగా సెలబ్రిటీల మరణాలు అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది వృద్ధాప్య కారణాలవల్ల స్వర్గస్తుల అవుతున్నారు. ఇంకొంతమంది సెలబ్రిటీల బంధువులు, తల్లిదండ్రులు, భాగస్వామ్యులు ఇలా ఎవరో ఒకరు వారికి సంబంధించిన వ్యక్తులు మరణించి వారిని మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో స్టార్ సీనియర్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న రాధికా శరత్ కుమార్ ఇంట్లో ఇప్పుడు విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లి గీత నిన్న రాత్రి 9:30 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆమె వయసు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న గీత సెప్టెంబర్ 21న తుది శ్వాస విడవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు , రాజకీయ నాయకులు, అభిమానులు గీత మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. గీత ఎవరో కాదు ప్రముఖ సీనియర్ నటులు సామాజిక సంఘసంస్కర్త ఎం.ఆర్ రాధా భార్య. భర్త అడుగుజాడల్లోనే ఒకవైపు కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూనే.. మరొకవైపు పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు వెనుకబడిన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు గీత. భర్త మరణం తర్వాత అన్ని తానే అయి పిల్లలను పోషించిన ఈమె.. ఇప్పుడు అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గీత అంత్యక్రియలను నేడు సాయంత్రం 4:30 గంటలకు సెనెంట్ నగర్ లోని స్మశానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ప్రముఖ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ విషయానికి వస్తే.. రాధిక శరత్ కుమార్ విషయానికి వస్తే.. సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా సన్ నెట్వర్క్ ద్వారా ప్రసారమవుతున్న ఎన్నో తెలుగు, తమిళ్ సీరియల్స్ లో నటించడమే కాకుండా వాటిని నిర్మిస్తూ మరింత పాపులారిటీ అందుకుంది. ఈమె తండ్రి ప్రముఖ తమిళ నటుడు ఎమ్. ఆర్.రాధా కాగా.. ఈమె తల్లి గీత. శ్రీలంకకు చెందినవారు.
రాధిక 1963 ఆగస్టు 21న గీత, ఎం.ఆర్ రాధా దంపతులకు జన్మించింది. ఇప్పటికే మూడుసార్లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట 1985లో ప్రతాప్ పోతన్ అనే తమిళ నటుడిని వివాహం చేసుకున్న ఈమె.. రెండు ఏళ్ల తర్వాత విడిపోయి రిచర్డ్ హార్డీతో 1990లో ఏడడుగులు వేసింది. ఈమెకు ఒక కూతురు జన్మించిన తర్వాత అతడికి కూడా విడాకులు ఇచ్చి సహనటుడు శరత్ కుమార్ ను 2001లో మూడో వివాహం చేసుకుంది. 2004లో వీరికి కుమారుడు రాహుల్ జన్మించారు. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఈమె సవతి తల్లి అవుతుంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
