త్రిబాణధారి బార్బరిక్.. సత్యరాజ్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ షాకింగ్ కు గురిచేస్తున్నాయి. అయితే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ విషయంలో వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు.
By: M Prashanth | 19 Aug 2025 12:22 AM ISTస్టార్ యాక్టర్ సత్యరాజ్ లీడ్ రోల్ లో త్రిబాణధారి బార్బరిక్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రంలో వశిష్ట ఎన్. సింహ, సత్యం రాజేష్, ఉదయ భాను, క్రాంతి కిరణ్, సాంచి రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్నారు.
ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న త్రిబాణధారి బార్బరిక్ పై ఆడియన్స్ లో, సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన పాటలు.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ ఒక్కసారిగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా స్పెషల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
అదే సమయంలో అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది. ట్రైలర్ లోని విజువల్స్, ఆర్ ఆర్ అందరినీ మెప్పించాయి. ముఖ్యంగా మోహన్ శ్రీవత్స మేకింగ్, ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం ఆసక్తి పెంచేసింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. మొదటి ప్రాజెక్ట్ అయినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని స్పష్టంగా అర్థమవుతుంది.
కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ షాకింగ్ కు గురిచేస్తున్నాయి. అయితే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ విషయంలో వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేపడుతున్నారు. అదే సమయంలో సినిమాను ఆగస్టు 22వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ లో చిన్న మార్పు చేశారు.
సరైన రిలీజ్ డేట్, కావాల్సినన్నీ థియేటర్లు లభించడం కోసం ఆగస్ట్ 29కి వాయిదా వేశారు మేకర్స్. దీంతో త్రిబాణధారి బార్బరిక్ మూవీ అనుకున్న దానికంటే ఒక వారం లేట్ గా గ్రాండ్ గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అయితే సినిమాను తెరకెక్కించడం కంటే సరైన రిలీజ్ టైం, కావాల్సినన్ని థియేటర్లను బ్లాక్ చేసుకుని విడుదల చేయడమే గొప్ప విషయమనే చెప్పాలి.
ఎందుకంటే.. సరైన రిలీజ్ డేట్ దొరికి.. అనుకునన్ని థియేటర్లు దక్కితే.. భారీ రిలీజ్ అయితే.. ఆ చిత్రానికి విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు త్రిబాణధారి బార్బరిక్ మేకర్స్ కూడా అదే పని చేశారు. మంచి రిలీజ్ డేట్ కోసం చూసి ఆగస్ట్ 29న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
