Begin typing your search above and press return to search.

త్రిబాణధారి బార్బరిక్‌ సెన్సార్.. సినిమా ఎలా ఉండబోతోందంటే..

లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికేట్‌ సాధించింది. దీంతో ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్నీ సిద్ధమయ్యాయి.

By:  M Prashanth   |   28 Aug 2025 5:20 PM IST
త్రిబాణధారి బార్బరిక్‌ సెన్సార్.. సినిమా ఎలా ఉండబోతోందంటే..
X

టాలీవుడ్‌లో ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నా, కొన్ని చిత్రాలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాంటి అటెన్షన్ గ్రాబ్ చేసిన సినిమానే ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ చిత్రం కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా, భారతీయ సినీ పరిశ్రమలో తొలిసారి ఒక ప్రత్యేక పాత్రను వెండితెరపై చూపించబోతున్నది.


లేటెస్ట్ గా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని, యూ/ఏ సర్టిఫికేట్‌ సాధించింది. దీంతో ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పవర్‌ఫుల్ స్క్రీన్స్, యాక్షన్ డ్రామా, ఎమోషన్స్‌తో నిండిన కథ అని మేకర్స్ చెప్పడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.

ఈ సినిమాను మారుతి సమర్పిస్తుండటం హైలైట్‌గా మారింది. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వశిష్ట ఎన్.సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

టెక్నికల్ వర్క్ పరంగా కూడా ‘త్రిబాణధారి బార్బరిక్’ చర్చనీయాంశమవుతోంది. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతం కూడా పాజిటివ్ హైప్ క్రియేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు వచ్చిన రెస్పాన్స్ సినిమాను చూసే ఆసక్తిని మరింత పెంచింది. కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి అందించిన విజువల్స్ గ్రాండియర్‌ ను చూపిస్తున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ సినిమాను మరో లెవెల్‌లోకి తీసుకెళ్లేలా ఉందని చెప్పుకోవచ్చు.

ప్రేక్షకులలో ఇప్పటికే ఈ మూవీపై పాజిటివ్ టాక్ నెలకొంది. సోషల్ మీడియాలో సెన్సార్ కంప్లీట్ అప్‌డేట్ తో పాటు కొత్త పోస్టర్ విడుదల కాగానే చర్చలు మొదలయ్యాయి. బార్బరిక్ అనే కొత్త కాన్సెప్ట్ కథతో రూపొందిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి, యాక్షన్, ఎమోషన్, టెక్నికల్ గ్రాండియర్ అన్నీ కలిపిన ఈ సినిమా ఆగస్ట్ 29న థియేటర్లలో భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రత్యేకమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ కిక్ ఇవ్వనుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరి, ‘త్రిబాణధారి బార్బరిక్’ థియేటర్స్‌లో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.