Begin typing your search above and press return to search.

హిట్ సంచ‌ల‌నం కూడా నిర్మాణంలోకా!

తాజాగా మ‌రో హిట్ సంచ‌ల‌నం నిర్మాత‌గా కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్ అంటే ఆ విష‌యం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

By:  Srikanth Kontham   |   19 Feb 2026 6:00 PM IST
హిట్ సంచ‌ల‌నం కూడా నిర్మాణంలోకా!
X

సినిమా నిర్మాణంలో హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. సొంతంగా బ్యాన‌ర్లు స్థాపించి వ‌డి వ‌డిగా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. తెలివిగా నిర్మాణంలోనూ సంపా దిస్తున్నారు. స‌క్సెస్ అయితే స‌బ్ బ్యాన‌ర్లు కూడా స్థాపించి నిర్మాణాన్ని మ‌రింత పెరుగులు పెట్టిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా స్టార్ హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు నిర్మాత‌ల‌గా రాణిస్తున్నారు. తాజాగా మ‌రో హిట్ సంచ‌ల‌నం నిర్మాత‌గా కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్ అంటే ఆ విష‌యం తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ లో అత‌డో ట్రెండింగ్ డైరెక్ట‌ర్. ఇంత వ‌ర‌కూ ద‌ర్శ‌కుడిగా వైఫ‌ల్య‌మే లేదు. చేసిన ప్ర‌తీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. వంద‌ల కోట్లు వ‌సూళ్లు అత‌డి సినిమాతోనే రాణించాడు. దీంతో హీరోలు, నిర్మాత‌ల‌ పాలిట బంగారు బాతులా మారిపోయాడు. ఆ డైరెక్ట‌ర్ తో సినిమాలు చేయ‌డానికి హీరోలే పోటీ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది స్టార్స్ ను డైరెక్ట‌ర్ చేసాడు. అదీ త‌క్కువ బ‌డ్జెట్ లో భారీ వ‌సూళ్లు అందించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. నిర్మాత ఇచ్చిన బ‌డ్జెట్ కంటే ఆలోపే నిర్మాణం పూర్తి చేయ‌డంలో అత‌డో స్పెష‌లిస్ట్ అయిపోయాడు.

రెండు రూపాయ‌లు ఖ‌ర్చు అయ్యే ద‌గ్గ‌ర రూపాయి ఖ‌ర్చుతో తేల్చేస్తాడు. షూటింగ్ పూర్తి చేయ‌డానికి నెల‌లు స‌మ‌యం తీసుకోడు. అత‌డు క‌థ‌లు రాయ‌ల‌న్నా సంవ‌త్స‌రాలు అవ‌స‌రం లేదు. త‌లుచుకుంటే నెల రోజుల్లో క‌థ సిద్దం చేయ‌గ‌ల‌డు. అత‌డితో సినిమా అంటే నిర్మాత‌కు ప్ర‌చారం ప‌రంగా పెద్ద‌గా ఖ‌ర్చు ఉండ‌దు. ఎలాంటి స‌న్నివేశాన్ని అయినా తెలివిగా డీల్ చేయ‌గ‌ల‌డు. ఈ నేప‌థ్యంలో తానెందుకు నిర్మాత‌గా మార‌కూడ ద‌నుకున్నాడు. అలా పుట్టిన ఆలోచ‌న నుంచి సొంతంగా బ్యాన‌ర్ స్థాపించాల‌ని సంక‌ల్పిస్తున్న‌ట్లు తెలిసింది.

ప్ర‌స్తుతం బ్యాన‌ర్ పేరును త‌న స్నేహితుల‌తో ప‌రిశీలిస్తున్నాడుట‌. ఎలాంటి పేరు అయితే క్యాచీగా ఉంటుందో? కొన్ని టైటిల్స్ ఇవ్వ‌మ‌ని త‌నతో చ‌నువుగా మెలిగే అసిస్టెంట్ల‌ను అడిగాడుట‌. అలాగే త‌న‌కు కెరీర్ ఆరంభంలో అవ‌కాశాలు ఇచ్చిన నిర్మాత సూచ‌న‌లు, స‌ల‌హాలు కూడా తీసుకున్నాడుట‌. ఆప్ర‌క్రియ పూర్త‌యితే ఛాంబ‌ర్ లో బ్యాన‌ర్ కి సంబ‌ధించిన రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు భ‌విష్య‌త్ లో తాను డైరెక్ట్ చేసే సినిమాలు ఏవైనా? భాగ‌స్వామ్యంలో చేసే అవ‌కాశం ఉంటుంది. ఇంత వ‌ర‌కూ సినిమాకు పారితోషికం తీసుకునే ప‌ని చేసాడు. ప‌నికి త‌గ్గ‌ట్టు పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పుడా క్రియేటివిటీని పెట్టుబ‌డిగా పెట్టే అవ‌కాశం ఉంది. త‌న బ్యాన‌ర్ నే పెట్టుబ‌డిగా పెట్టి లాభాల్లో వాటా తీసుకునే అవ‌కాశం ఉంది.